సారథిన్యూస్, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎదుట శనివారం ఐదుగురు మావోయిస్టు దళసభ్యులు లొంగిపోయారు. చింతూర్ సబ్‌డివిజన్ పరిధిలోని ఎటపాక పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ సమక్షంలో వీరు లొంగిపోయారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందజేయటంతోపాటు ఉపాధి కూడా కల్పిస్తుందని చెప్పారు.