పాకిస్థాన్‌లో మైనార్టీలకు రక్షణ కరువైంది. హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరగడం అక్కడ పరిపాటిగా మారింది. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని బదిన్ సింద్ పాకిస్థాన్ ప్రాంతంలో ‘శ్రీ రామ్ మందిర్’ను గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం చేశారు. ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలను విధ్వంసం చేయడం పాకిస్థాన్‌లో పరిపాటిగా మారింది. బదిన్ ప్రావిన్స్‌లోని కరియో ఘన్వర్ ప్రాంతంలో ఈ మందిరం వుండేది. అక్టోబర్ 10వ తేదీ రాత్రి కొందరు దుండగులు ఈ మందిరాన్ని కూల్చి వేశారు. […]
కరాచీ: అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌కు చెందిన ఓ సినీనటితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్‌కు చెందిన మెహ్విష్ హయత్ (37) మొదట ఐటం గర్ల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం పలు సినిమాల్లో నటించింది. ఆమెతో దావూద్ సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ఇండియా నుంచి పారిపోయిన దావూద్ పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ భారీ బంగ్లాలో నివాసం ఉంటున్నాడు. దావూద్‌కు పాక్ చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తులు, […]
కరాచీ: కరోనా పాజిటివ్ వచ్చిన పది మంది క్రికెటర్లను పక్కనబెట్టి.. మిగతా ఆటగాళ్లతో పాకిస్థాన్ జట్టు.. ఇంగ్లండ్లోని మాంచెస్టర్‌కు చేరుకుంది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బంది ఈ బృందంలో ఉన్నారు.14 రోజుల క్వారంటైన్ తర్వాత వామప్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ‘మరో చారిత్రాత్మక పర్యటనకు వెళ్తున్నాం. ఇంగ్లండ్‌లో ఆడటం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది’ అని బాబర్ ఆజమ్ ట్వీట్ చేశాడు. సహచరులతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోను ఉంచాడు. మూడు టెస్టులు, […]
శ్రీనగర్: భారత భూభాగంలోకి పాకిస్థాన్ గూఢచార సంస్థకు చెందిన ఓ డ్రోన్ రావడంతో బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ దీన్ని కూల్చివేసింది. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా.. హిరానగర్, సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలను సరిహద్దు భద్రతా దళం గమనించింది. వెంటనే అప్రమత్తమైన 19 బెటాలియన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ దీన్ని కూల్చి వేసింది. ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ ను విజయంతంగా నేలమట్టం చేశారు. ఈ […]