Breaking News

ngkl

‘కందనూలు’లో అవినీతి కంపు

‘కందనూలు’లో అవినీతి కంపు!

సామాజికసారథి, నాగర్ కర్నూల్: కందనూలు మున్సిపాలిటీ అవినీతి కంపు రాజ్యమేలుతోంది. కంచె చేను మేసిందన్న చందంగా మున్సిపాలిటీకి జవాబుదారీగా ఉండాల్సిన మున్సిపల్ కమిషనర్ సిబ్బంది కొందరు స్టాఫ్​ తో కుమ్మక్కై అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా మున్సిపాలిటీలో తన మాటవినని కిందిస్థాయి సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ మెమోలు జారీచేయడం పరిపాటిగా మారింది. మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి పని జరిగినా కమిషనర్​ తనవంతు పర్సెంటేజీ తనకు వచ్చేలా చూసుకుంటున్నారని కొందరు సిబ్బంది చెబుతున్నారు. అంతేకాకుండా నాగర్ కర్నూల్ […]

Read More
‘ఛీ...’ కొట్టినా వస్తున్నారు!

‘ఛీ…’ కొట్టినా వస్తున్నారు!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: రాష్ట్రంలో బీఆర్​ఎస్​ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. అయితే కేసీఆర్​ పరిపాలన కాలంలో రాజకీయంగా పడిన ఇబ్బందులను ఇప్పటికీ నాటి విపక్షమైన కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు గుర్తుచేసుకుంటుంటారు. కేసులు, ఇతరత్రా విషయాల్లో ఇబ్బందులు గురిచేసేవారని చెబుతుంటారు. అధికారమార్పిడి జరగడంతో కొందరు కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇదిలాఉండగా, నాగర్​ కర్నూల్​ నియోజకవర్గంలో గత బీఆర్​ఎస్​ హయాంలో రాజకీయంగా జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహరిస్తూ ఈనెల […]

Read More
నాడు వేధించారు.. నేడు వంచన చేరారు!

నాడు వేధించారు.. నేడు పంచన చేరారు!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: అధికారం కోల్పోయిన బీఆర్​ఎస్​ నేతలు మైండ్​ గేమ్​ షురూ చేశారు. అడ్డగోలు వ్యవహారాలతో ‘ఛీ’ అనిపించుకుంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ కార్యకర్తలను ముఖ్యంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరులను తీవ్రంగా వేధించారు. ఎన్నో ఏండ్ల తర్వాత నాగర్ కర్నూల్ నియేజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా డాక్టర్ రాజేశ్​ రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల సుదీర్ఘనిరీక్షణ ఫలించింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరులుగా […]

Read More
ఆర్మీ మాజీ జవాన్​ చిల్లర చేష్టలు!

ఆర్మీ మాజీ జవాన్​ చిల్లర చేష్టలు!

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి భార్యపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్మీ మాజీ జవాన్ ను స్థానికులు చెప్పులతో చితకబాదారు. పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వార్నింగ్​ ఇచ్చారు. అంతకుముందు అతడి ఇంటి ముందు ఆ గ్రామ మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. స్థానికుల కథనం.. పాలెం గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ జవాన్ దుగ్యాల వెంకటయ్య.. ఓ మాజీ ప్రజాప్రతినిధి […]

Read More
పాలెంలో బోగస్​ ఓట్లు!

పాలెంలో బోగస్​ ఓట్లు!

సామాజికసారథి, బిజినేపల్లి: స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు కూడా ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. వార్డుల విభజన, కొత్త ఓటర్ల చేర్పులు, మార్పులు వంటి ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. దసరా తర్వాత గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగవచ్చనే ప్రచారం కూడా ఊపందుకుంది. అధికారులు అంతా రెడీ చేసి సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు బాగానే బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలో బోగస్​ ఓట్లు నమోదుచేశారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మేజర్​ పంచాయతీ […]

Read More
గ్రామాల నుంచి బీఎస్పీని తరిమికొట్టాలి

గ్రామాల నుంచి బీఎస్పీని తరిమికొట్టాలి

ఎమ్మార్పీఎస్​ నాగర్​ కర్నూల్​ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: ఎస్సీ వర్గీకరణను సమర్థించే ప్రతి మాదిగ బిడ్డ గ్రామాల నుండి బీఎస్పీని తరిమికొట్టాలని ఎమ్మార్పీఎస్​ నాగర్​ కర్నూల్​ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల పార్టీ అనుకున్నాం కానీ అది మనపార్టీ కాదు అగ్రకులాలకు కొమ్ముకాస్తున్న పార్టీ అని తేలిపోయిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ బీఎస్పీ భారత్​ బంద్​ నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.బీఎస్పీ నిజస్వరూపాన్ని తెలుసుకుని […]

Read More
బిజినేపల్లిలో విషపు రెడ్డి

బిజినేపల్లిలో విషపు రెడ్డి!

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ లీడర్ నిర్వాకం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడినంటూ ఆ లీడర్ చేస్తున్న అరాచకాలు అన్నీఇన్ని కావు. అధికార పార్టీ లీడర్ నంటూ బిజినేపల్లి మండలంలో ఏకంగా మూడు గ్రామాలపై పెత్తనం చెలాయిస్తుండటంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆరంభంలోనే ఆ లీడర్ గలీజ్ దందాలకు అడ్డుకట్ట వేయకపోతే మూడు గ్రామాల కార్యకర్తలు, నాయకులు […]

Read More
వట్టెంలో త్రిపుర గవర్నర్ పూజలు

వట్టెంలో త్రిపుర గవర్నర్ పూజలు

సామాజికసారథి, బిజినేపల్లి: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మంగళవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారికి మాజీఎంపీ పి.రాములు, సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, జనుంపల్లి రాంచంద్రారెడ్డి, సేవికాసమితి విభాగ్ కార్యవాహిక బి.దేదీప్యశ్రీ, బుసిరెడ్డి శకుంతల, నాగర్ కర్నూల్ నియోజకవర్గం రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు ద్యాసాని లింగారెడ్డి, క్యాడెట్ బి.సాయిసుధాంశురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More