సామాజికసారథి, బిజినేపల్లి: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మంగళవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారికి మాజీఎంపీ పి.రాములు, సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, జనుంపల్లి రాంచంద్రారెడ్డి, సేవికాసమితి విభాగ్ కార్యవాహిక బి.దేదీప్యశ్రీ, బుసిరెడ్డి శకుంతల, నాగర్ కర్నూల్ నియోజకవర్గం రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు ద్యాసాని లింగారెడ్డి, క్యాడెట్ బి.సాయిసుధాంశురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సామాజికసారథి, బిజినేపల్లి: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. పిల్లలు, ఫ్యామిలీ సంబంధాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. ఈ అక్రమబంధానికి మరో వివాహిత బలైపోయింది. ఈ బంధంలో చిక్కుకున్న ఓ యువతి దారుణ హత్యకు గురైంది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. వట్టెం పరిధిలోని కల్వకుంటతండాకు చెందిన గిరిజన యువతి చిట్టెమ్మ(28) తన భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం […]
అడ్డుకున్న వట్టెం భూనిర్వాసితులు సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చుక్కెదురైంది. వట్టెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే అదనంగా లక్ష రూపాయలు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట ఇచ్చి నాలుగేళ్లు గడిచినా నేటికీ నెరవేర్చలేదని వట్టెం భూనిర్వాసితులు, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని సోమవారం సాయంత్రం వట్టెం గ్రామంలో అడ్డుకున్నారు. ఆసరా పింఛన్ పంపిణీలో […]
సామాజిక సారథి, బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయం ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దాలని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు ఆకాంక్షించారు. శుక్రవారం నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్, అధ్యాపకులు భాస్కరాచారి హైదరాబాద్ లో ఆయనను కలిసి బొకే ఇచ్చి, శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ.. వట్టెం నవోదయ విద్యాలయంలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడి గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. […]
సామాజిక సారథి, బిజినేపల్లి: వట్టెం వేంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త దివంగత సందడి రంగారెడ్డి వైష్ణవ సంస్కృతి వ్యాప్తికి, ఆధ్యాత్మిక భావాల ప్రాచుర్యానికి మార్గదర్శకులని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి దేవనాధ జీయర్‌స్వామి కొనియాడారు. స్వర్గీయ రంగారెడ్డి సంస్మరణ సభను ఆదివారం నాగర్‌కర్నూల్‌జిల్లా వట్టెం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి మండలి చైర్మన్ అనంత నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్రావు, నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, వికాస తరంగిణి రాష్ట్ర […]
సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా జవహర్ నవోదయ విద్యాలయం తెలుగు అధ్యాపకుడు, ప్రముఖకవి శేషం సుప్రసన్నాచార్యులు రచించిన ‘హిమాలయాలకు చెమట పడుతుంది’ కవితా సంకలనం ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం కరీంనగర్ అడినషనల్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ తన క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రసన్న కవిత్వంలో అనేక సామాజికాంశాలు ఉండటమే కాకుండా వారు నేర్చుకున్న సంస్కృతభాష ప్రభావం, పురాణేతిహాసాల ప్రయోగాలు విస్తృతంగా ఉన్నాయని, పదప్రయోగం అనిర్వచనీయమని కొనియాడారు. పుస్తక పరిచయకర్త, […]
సారథి, బిజినేపల్లి: మండలంలోని వట్టెం గ్రామంలో పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పీఆర్ సీలో చోటు కల్పిస్తున్నామని చెప్పిన హామీలను అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధు పథకంలో పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బిజినేపల్లి మండలాధ్యక్షుడు జిల్లెల రామకృష్ణ, పరుశరాములు, లక్ష్మయ్య, మల్లయ్య, ఎల్లమ్మ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం మృతులు తండ్రీకొడుకులు బిజినేపల్లి మండల కేంద్రంలో దుర్ఘటన పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సారథి, బిజినేపల్లి: అతివేగం ఇద్దరి నిండుప్రాణాలను బలితీసుకుంది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో తండ్రీకొడుకులు చనిపోయారు. ఈ దుర్ఘటన శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన శివకుమార్ గౌడ్(35), బాలయ్య గౌడ్(65) వట్టెం నుంచి వనపర్తికి వెళ్తున్నారు. అలాగే కోడేర్‌కు చెందిన […]