ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం
సామాజికసారథి, నాగర్ కర్నూల్: ఎస్సీ వర్గీకరణను సమర్థించే ప్రతి మాదిగ బిడ్డ గ్రామాల నుండి బీఎస్పీని తరిమికొట్టాలని ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల పార్టీ అనుకున్నాం కానీ అది మనపార్టీ కాదు అగ్రకులాలకు కొమ్ముకాస్తున్న పార్టీ అని తేలిపోయిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ బీఎస్పీ భారత్ బంద్ నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
బీఎస్పీ నిజస్వరూపాన్ని తెలుసుకుని ఇప్పటికైనా మాదిగలు వెంటనే రాజీనామా చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైందని కాదని బీఎస్పీ నిరూపించగలదా? అని నిలదీశారు. ‘మీరు మాదిగ బిడ్డకు పుడితే మీ లోపల మాదిగ రక్తం ఉంటే తక్షణమే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉండాలని సిగ్గూ శరం లేకుండా మాలలకు ఒత్తసు పలుకుతూ బీఎస్పీ పార్టీ మాయలో పడి జాతి ద్రోహులుగా కాకుండా మాదిగల పక్షాన నిలువాలి’ అని కోరారు. మాదిగల భవిష్యత్ కోసం 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసిన మంద కృష్ణమాదిగ పట్టుదలతో ఎస్సీ వర్గీకరణ సాధించారని కొనియాడారు. ఉద్యమంలో ఎంతోమంది మాదిగ బిడ్డలు అమరులయ్యారని గుర్తుచేశారు. వారి పోరాట త్యాగఫలితమే ఎస్సీ వర్గీకరణ జరిగింది అని గుర్తుంచుకోవాలన్నారు. మనం పుట్టిన తల్లిని మనం పెరిగిన ప్రాంతాన్ని ఎప్పుడు మర్చిపోవద్దన్నారు.