Breaking News

NEWCASES

చిన్నశంకరంపేటలో ఏడు కొత్తకేసులు

చిన్నశంకరంపేటలో 7 కొత్తకేసులు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో శుక్రవారం 7 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 21 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్​ వచ్చిందని వైద్యులు తెలిపారు. గవ్వలపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రాగా, రుద్రారం గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మండలంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని […]

Read More
తెలంగాణలో కరోనా

తెలంగాణలో 1,921 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 1,921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 88,396కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ ను విడుదల చేసింది. తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 674కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,210 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి […]

Read More
కరోనా కొత్తకేసులు

మొత్తం కేసులు @ 24 లక్షలు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 24,61,190 కు చేరుకున్నది. గత 24 గంటల్లోనే 64,553 కొత్తకేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 48,040 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 17,51,555 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 6,61,595 మంది వివిధ దవాఖానల్లో చికిత్సపొందుతున్నారు.

Read More

చిన్నశంకరంపేటలో రెండు కేసులు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో బుధవారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్​ శ్రావణి తెలిపారు. మొత్తం 11 మందికి టెస్టులు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి టెస్టులు చేసుకోవాలన్నారు.

Read More

రికవరీ రేటు 70.38 శాతం

ఢిల్లీ: మనదేశంలో కరోనా విజృంభణ ఏ మాత్రం ఆగడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 60,963 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 56,110 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కావడం ఊరట నిచ్చే అంశం. ఇప్పటివరకు 16,39,599 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 70.38 శాతం ఉన్నదని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 23,29,638 కి చేరుకున్నది. ఇప్పటివరకు 46,091మంది కోరోనా మృతిచెందగా.. 6,43,948 మంది వివిధ […]

Read More
కరోనా కొత్తకేసులు

22 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. ఇప్పటివరకు 22,15,074 కేసులు నమోదయ్యాయి. కేవలం గత 24 గంటల్లోనే 62,064 మందికి కొత్తగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. 6,34,949 యాక్టివ్​ కేసులున్నాయి. ఇప్పటివరకు 44,386 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,077 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు 2.45 కోట్ల పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్​ తెలిపింది.

Read More
భారీగా పెరుగుతున్న కేసులు

కరోనా కేసులు@ 20 లక్షలు

ఢిల్లీ: మనదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. గురువారం నాటికి కేసుల సంఖ్య 20 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 62,538 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటివరకు మొత్తం 20,27075 మందికి కరోనా సోకగా, 41,585 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,07384 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 13,78,106 మంది కోలుకున్నారు. ఒక్క రోజులో 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కరోనా దేశంలో మరణాల రేటు 2. […]

Read More
మానోపాడులో కొత్తకేసులు

మానవపాడులో 21 కొత్తకేసులు

సారథి న్యూస్​, మానవపాడు: కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు పీహెచ్​సీ వైద్యురాలు డాక్టర్​ దివ్య సూచించారు. మానోపాడు పీహెచ్​సీ పరిధిలో 75 మందికి పరీక్షలు నిర్వహించగా 21 కేసులు బయటపడ్డాయని చెప్పారు. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జలుబు, దగ్గు , ఆయాసం, జ్వరం ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Read More