సారథి న్యూస్, రామయంపేట: ప్రతి గ్రామంలో రైతులు వేసిన పంటలను నమోదు చేయించుకోవాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీష్ సూచించారు. శనివారం మండలంలోని నందిగామ గ్రామంలో పంటల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. పంట గణన ప్రక్రియ పక్కాగా ఉండాలన్నారు. రైతుల నుంచి సేకరించిన వివరాలను ఎప్పకప్పుడు ఆన్లైన్లో అప్‌లోడ్‌చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఈవో దివ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సంపత్, రాజగోపాల్ ఉన్నారు.
సారథి న్యూస్, మెదక్: పల్లెలను నందనవనాలుగా తీర్చదిద్దాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెగిగ్రేషన్ పనులను త్వరగా పూర్తిచేయడంతో పాటు గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలని ఆదేశించారు. నాటిన మొక్కలను ట్రీగార్డులను ఏర్పాటు చేయాలన్నారు. మెదక్ జిల్లాను ఓడీఎఫ్ ప్లస్ జిల్లాగా […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీవర్షం కురుస్తోంది. కొల్చారంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆయా మండలాల్లో చాలా చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో భారీవర్షం కురవడంతో కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలోని మహబూబ్ నహర్ కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. భారీవర్షాలు కురిసి చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకోవడంతో రైతులు, కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సారథి న్యూస్,రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కోతుల బెడద ప్రజలను వేధిస్తున్నది. ప్రజలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోడ్లమీద కోతులు గుంపులుగుంపులుగా చేరి భయపెడుతున్నాయి. ఇండ్లలోకి చేరి ఆహారపదార్థాలను ఎత్తుకుపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని కోతులను తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతువేదికల నిర్మాణాలను త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. రైతువేదికల నిర్మాణానికి జిల్లాలో 76 క్లస్టర్లుగా విభజించామన్నారు. పనుల పురోగతిని ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా […]
సారథి న్యూస్,రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండల దూదేకుల (నూర్బాష్) సంఘాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా ఖాసీం సాబ్, కోకన్వీనర్‌గా ఫిరోజ్, కోశాధికారిగా ఇమామ్ సాబ్, సలహాదారుడిగా అహ్మద్ పాషాను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, కోఆప్షన్ సభ్యుడు గౌస్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎండీ అజ్గర్, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, జిల్లా నాయకులు ఇబ్రాహీం, బాబు మియా,గౌస్ […]
సారథి న్యూస్, మెదక్: రైతులను మోసగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఆటోనగర్ లో ఉన్న వీరభద్ర, కేదారీశ్వరి ట్రేడింగ్ కంపెనీ ఫర్టిలైజర్ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు. రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను ఈ –పాస్ మిషన్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుందని అసలు దానిని వినియోగిస్తున్నారా ? లేదా ? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ–పాస్ […]
సారథి న్యూస్, మెదక్: జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్ లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని గ్రామాలు, తండాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నాయని అన్నారు. చిన్నతనంలోనే పెళ్లిచేస్తే వారి మానసికస్థితి ఎదగకపోవడంతో సమస్యలు వస్తాయని కలెక్టర్ వివరించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తతెత్తకుండా మెదక్ జిల్లాలో సఖి సెంటర్‌ను నిర్వహించనున్నట్లు […]