సారథి న్యూస్, హుస్నాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళి(37) శనివారం హస్నాబాద్‌కు వచ్చాడు. కాగా పట్టణంలోని నాగారం వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
సారథిన్యూస్, అమరావతి: జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్సీపీ గుండాలు తనను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వాళ్ల బెదిరింపులకు తాను బెదిరిపోయే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తనకు రోజుకు 10 సార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని బెదిరించినట్లు ఉమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే వైసీపీ మంత్రులు బెదిరిస్తున్నారని చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్ […]
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద లారీ.. కారును ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న మేకల రాకేశ్, మేడి చందు, రోహిత్, సాబిర్, పవన్ మృతిచెందారు. మృతులంతా పోచం మైదాన్‌కు చెందినవారని సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తొలి రోజు పాఠశాలకు వెళ్లిన ఒక ప్రభుత్వ టీచర్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో శంకర్‌నాయక్ ఎస్జీటీగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులందరూ 27 నుంచి పాఠశాలలకు రావాలని ఆదేశించడంతో.. గురువారం ఉదయం స్కూలుకు బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో కాలినడకన పాఠశాలకు వెళ్తుండగా.. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకర్‌నాయక్ ఎడమకాలు ఛిద్రమైంది. తీవ్రంగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు ఆయనను 108 […]
సారథిన్యూస్, అనంతపురం: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీ డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ఈఘటన అనంతరం జిల్లా తాడిపత్రి సమీపంలోని కడప రహదారిపై చోటుచేసుకున్నది. తాడిపత్రి నుంచి ఓ లారీ వరిపొట్టు లోడుతో వస్తున్నది. ఈ లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లారీడ్రైవర్ నిశార్ సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు
సారథి న్యూస్, రంగారెడ్డి: కరోనా లక్షణాలతో ఉన్న ఓ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరో 58 మంది హమాలీ కార్మికులను హోమ్ క్వారంటైన్ కు పంపించారు. రాజస్థాన్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు గన్నీ బ్యాగ్స్ లోడ్ తో వచ్చిన లారీలో ఎక్కిన ఓ ప్రయణికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు ప్రయాణించిన లారీ విషయమై పోలీసులు ఆరా తీయగా వలిగొండ లో ఉన్నట్లు గుర్తించి డ్రైవర్, క్లీనర్లను రంగారెడ్డి జిల్లా రావిరాల […]