బైక్ ను అతివేగంతో ఢీకొట్టిన కారు అడ్డొచ్చినవారిపైకి దూసుకెళ్లిన డ్రైవర్ ఒకరి దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం చెట్లమాటున కారును వదిలేసి పరారీ సారథి, వెల్దండ: కారు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. మరో ఇద్దరిని చావు అంచులదాకా తీసుకెళ్లింది.. హైవేపై జెట్స్పీడ్తో వస్తున్న కారు మొదట బైక్‌ను ఢీకొట్టడంతో దానిపై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడ్డారు.. ఓ వ్యక్తి కారును ఆపేందుకు ప్రయత్నించగా అతని కూడా ఢీకొట్టడంతో ఎగిరి అవతలపడ్డాడు.. ఎక్కడ […]
రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ట్రాక్టర్ బోల్తా జగన్నాథపురం ‘వై’జంక్షన్ లో కారుబోల్తా సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో శుక్రవారం రెండు చోట్ల వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టేకులగూడెం బీరయ్య గుట్ట సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి 16మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వరంగల్లు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరంతా గురువారం కోయవీరపురం పెళ్లి రిసెప్షన్ కు వచ్చి వెళ్తుండగా ఈ […]
మహబూబాబాద్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం ఆరుగురి దుర్మరణం.. పెళ్లింట విషాదఛాయలు సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి.. మంత్రుల విచారం సారథి న్యూస్, మహబూబాబాద్: మరో పది రోజుల్లో కూతురు పెళ్లి.. కొత్త వస్త్రాలు కొనేందుకు వెళ్లిన ఆ కుటుంబం ఇంటికి తిరిగిరాలేదు. శుభలేఖలతో బంధువుల వద్దకు వెళ్లాల్సిన పెళ్లింటి వారు విగతజీవులుగా మారారు. లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆరుగురిని బలితీసుకుంది. పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంగా మారింది. మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం ఎర్రకుంటతండాకు […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సంక్రాంతి పండుగ పూట ఈ విషాదకర ఘటన బుధవారం సాయంత్రం చిన్నశంకరంపేట గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన నిమ్మతోట ఆంజనేయులు(38) చిన్నశంకరంపేటలో వీక్లీ మార్కెట్ ముగించుకుని ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. చిన్నశంకరంపేట – అంబాజీపేట గ్రామాల సరిహద్దు కల్వర్టుపై మెదక్ నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఎక్సెల్ పై వెళ్తున్న ఆంజనేయులు తలకు తీవ్ర […]
సారథి న్యూస్, చేవెళ్ల: చేవెళ్ల మండలంలోని కందవడా గేట్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారిపై ఇన్నోవా కారు బోర్ వెల్ లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ లోని తాడ్ బండ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కారులో ఇరుక్కున్న శవాలు బయటికి తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తొలి రోజు పాఠశాలకు వెళ్లిన ఒక ప్రభుత్వ టీచర్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో శంకర్‌నాయక్ ఎస్జీటీగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులందరూ 27 నుంచి పాఠశాలలకు రావాలని ఆదేశించడంతో.. గురువారం ఉదయం స్కూలుకు బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో కాలినడకన పాఠశాలకు వెళ్తుండగా.. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకర్‌నాయక్ ఎడమకాలు ఛిద్రమైంది. తీవ్రంగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు ఆయనను 108 […]
నడియాడ్: ఎదురెదురుగా వస్తున్న రెండుకార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పయారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్-వడోదర 8వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నడియాడ్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు అగ్నిమాపకశాఖ సూపరింటెండెంట్ దీక్షిత్ పటేల్ తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
సారథిన్యూస్, ఖమ్మం: రోడ్డుప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయపేట మండలం వేదాద్రి సమీపంలో చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద గోపవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం బంధువులతోకలిసి వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ట్రాక్టర్లో వెళ్తున్నారు. వేదాద్రి సమీపంలో ట్రాక్టర్‌ను ఎదురుగా వచ్చిన బొగ్గులారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరోముగ్గురు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పెదగోపవరంతోపాటు అదే మండలానికి చెందిన […]