సామాజిక సారథి, తుర్కయంజాల్: గుజరాత్ ఈనెల 16న ప్రధాని మోదీ ప్రారంభించనున్న సేంద్రియ వ్యవసాయ విధాన్ని ప్రతిఒక్కరూ టీవీల్లో, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మోర్చా జాతీయ కార్యవర్గం సభ్యుడు పాపయ్యగౌడ్ సూచించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడ రవీంద్ర రిసార్ట్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లచ్చిరెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పాపయ్య గౌడ్, […]
సామాజిక సారథి, తెల్కపల్లి: తెల్కపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ సీఎల్ఆర్ కాలేజీలో నిర్వహిస్తున్న ఉయ్యాలవాడ, కోడేర్, తాడూర్ బీసీ గురుకులాల్లో 600మంది విద్యార్థులకుగాను 12మంది టీచర్లు పనిచేస్తున్నారన్నారు.16సెక్షన్లు ఉంటే సెక్షన్ కి ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరన్నారు. 80మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి బోధన చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు పడుకోవడానికి కూడా వసతులు లేని స్థితిలో […]
నాగర్ కర్నూల్‌జిల్లాలో బీజేపీకి నాయకత్వ లోపం సరైన లీడర్లేక నిరుత్సాహంలో కేడర్ కల్వకుర్తిలో ఒంటరి పోరాటం చేస్తున్న టి.ఆచారి అచ్చంపేటలో ముందుకెళ్తున్న బంగారు శృతి రెండు పర్యాయాలు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ(బీజేపీ) వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాలని ప్లాన్ చేసుకుంటోంది. క్షేత్రస్థాయిలో ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం లేకపోవడంతో కేడర్నిరుత్సాహంతో ఉంది. ఇదే పరిస్థితిని నాగర్ కర్నూల్జిల్లాలోనూ ఎదుర్కొంటోంది. సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: […]
సామజిక సారథి, రాజోలి : డీజిల్, పెట్రోల్ ధరలపై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి నెలరోజులు గడుస్తున్నా… తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు వ్యాట్ ను తగ్గించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం […]
కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని కేవలం ఓ పత్రానికి పరిమితం చేయకుండా న్యాయం, హక్కులు ప్రతిఒక్కరికీ దక్కేలా చూడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సమన్యాయం దక్కేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా […]
సామాజిక సారథి, హన్మకొండ: హన్మకొండలోని వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ధర్మసాగర్ మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగాల రాజు కలిసి అభినందించారు. అనంతరం హన్మకొండలోని అదాలత్ సెంటర్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళలర్పించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక సారథి డిండి: ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలాపురంలో సీపీఐ నూతన జెండా ఆవిష్కరణతో పాటు జోగు బజార్ 12 వ వర్ధంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు బజార్ స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎండి మైన్ఉద్దీన్, సీపీఐ మండల కార్యదర్శి పోలే వెంకటయ్య, […]
సామాజిక సారథి, ములుగు: జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, బస్తాలు, లారీల కొరత లేకుండా వర్షానికి తడవకుండా పట్టాలు అందుబాటులో ఉంచాలని రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అంతించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా, ఇప్పటివరకూ ధాన్యం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం […]