Breaking News

KCR

కొనసాగుతున్న ఇండ్లు, ఆస్తుల నమోదు

సారథిన్యూస్​, మానోపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలో ఇండ్లు, ఆస్తుల నమోదు కార్యక్రమం కొనసాగుతున్నది. ఆదివారం జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి ముషాహీదా బేగం మానోపాడులో పర్యటించి నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇండ్లు, ఆస్తుల నమోదుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, తమ ఆస్తులు ఆన్​లైన్​లో వచ్చేలా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. మండలంలో నారాయణపురం, పెద్ద ఆముదాలపాడ్, చిన్న పోతుల పాడ్, పెద్ద పోతుల పాడ్, చంద్రశేఖర్ నగర్ గ్రామాల్లో జజరుగుతున్న ఇండ్ల నమోదును ఆమె […]

Read More

యోగీ దిగిపో..!

సారథి న్యూస్, రామగుండం: హథ్రాస్​లో జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని దళితసంఘాలు డిమాండ్​ చేశాయి. బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ దళితులను దగా చేస్తున్నదని దళితసంఘాల నేతలు ఆరోపించారు. యూపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? మానవహక్కులు ఉన్నాయా? ప్రజాస్వామ్యదేశంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం నిస్సుగ్గుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం గోదావరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల యాక్షన్ కమిటీ […]

Read More

రైతన్నల ఆక్రందనలు వినిపించవా?

సారథి న్యూస్​, మానవపాడు: ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు బాధపడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఎంజాయ్​ చేస్తున్నారని కాంగ్రెస్​ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ నియోజకవర్గంలో పర్యటించి పంటలను పరిశీలించారు. మానవపాడు మండలం మానవపాడు, అమరవాయి గ్రామాల్లో పంటలను పరిశీలించారు. పత్తి, మిరప పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని.. అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపించారు. ఆయన వెంట మనోపాడ్ […]

Read More

నయీం కేసు.. పోలీసులకు క్లీన్​చీట్​

కరుడుగట్టిన గ్యాంగ్​స్టర్​ నయీంను 2016 ఆగస్టు 8న పోలీసులు ఎన్​కౌంటర్​ చేసిన విషయం తెలిసిందే. అయితే నయీం ఎన్​కౌంటర్​ తర్వాత అతడి అక్రమాలు ఒక్కొక్కటీ బయటికొచ్చాయి. నయీం పోలీసులను అడ్డుపెట్టుకొని అనేక​ అక్రమాలు చేశాడని వార్తలు వినిపించాయి. అప్పట్లో నయీం అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సిట్​తో దర్యాప్తు చేయించింది. అయితే దర్యాప్తు చేసిన సిట్..​ నయిం అక్రమాల్లో పోలీసుల పాత్ర ఏమీలేదని తేల్చిచెప్పింది. నయీం భూ అక్రమాలకు సహకరించినట్టు పలువురు ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారులపై ఆరోపణలు […]

Read More

నన్ను వదిలేయండి.. డ్రగ్స్​తీసుకోలేదు

కర్ణాటక సినీ పరిశ్రమను డ్రగ్స్​ కేసు కుదిపేస్తున్నది. ఇప్పటికే హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి డ్రగ్స్​కేసులో అరెస్టయ్యారు. అయితే వారు సెక్స్ రాకెట్​ కూడా నడుపుతున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. మరోవైపు సంజనా, రాగిణి ఎవరిపేరు బయటపెడతారో అని సర్వత్రా టెన్షన్​ నెలకొన్నది. అయితే ఇటీవల ఈ కేసులో కర్ణాటకకు చెందిన ప్రముఖ టీవీ యాంకర్​ అనుశ్రీని పోలీసులు విచారణకు పిలించారు. దీంతో అనుశ్రీ డ్రగ్స్​కేసులో ఇరుక్కున్నదంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అనుశ్రీ ఇన్​స్టాలో […]

Read More

పరిశుభ్రతతో రోగాలు దూరం

సారథి న్యూస్​, నిజాంపేట: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని మెదక్​ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన నిజాంపేటలో సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తే వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆయాగ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

సంస్థాగతంగా బలపడదాం

సారథి న్యూస్​, రామగుండం: టీఆర్​ఎస్​ పార్టీని రామగుండం నియోజకవర్గంలో మరింత బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పిలుపునిచ్చారు. గురువారం ఆయన రామగుండం నియోజవర్గం టీఆర్​ఎస్​ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, సమన్వయ కమిటీ సభ్యులు, పట్టణ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More

దున్నపోతుల బలి నేరం

సారథి న్యూస్, రామాయంపేట: గ్రామాల్లో జరిగే ఉత్సవాల్లో దున్నపోతులను అమ్మవారికి బలివ్వడం చట్టరిత్యా నేరమని నిజాంపేట వెటర్నరీ అధికారి సుధాకర్ దేశ్ ముఖ్ హెచ్చరించారు. గురువారం ఆయన మెదక్​ జిల్లా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో కరోనా విస్తరిస్తున్నదని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చల్మెడ గ్రామంలో కరోనా మహమ్మారిని పోవాలంటే అమ్మవారికి దున్నపోతులు బలివ్వాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో ఇంటికి రూ. 1000 వసులూ […]

Read More