Breaking News

KAMMAM

తెలంగాణలో రైతే రాజు

తెలంగాణలో రైతేరాజు

సారథి న్యూస్​, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం నగరం ఏడో డివిజన్​ అల్లిపురంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ […]

Read More
మంత్రి ఈటలకు ఎమ్మెల్యే విన్నపం

అమాత్యుడికో విన్నపం

సారథి న్యూస్​, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుందని, అందువల్ల ఇక్కడ కొత్త ఆస్పత్రిని కట్టాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు ఆయన ఖమ్మం వచ్చిన ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్​కు వినతిపత్రం ఇచ్చారు. 1970లో ఈ ఆస్పత్రిని అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి హయాంలో కట్టారని వివరించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Read More

రేషన్​ కార్డుకూ లంచం

సారథి న్యూస్​, వైరా: ప్రభుత్వ అధికారుల్లో కొందరు చేస్తున్న నీచమైన పనుల వల్ల మొత్తం వ్యవస్థకే మచ్చ ఏర్పడుతుంది. రేషన్​ కార్డు మంజూరు చేసేందుకు లంచం తీసుకుని తాజాగా ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపడికి చెందిన ఓ వ్యక్తి రేషన్​ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కార్డు మంజూరు చేయాలంటే రూ.1500 లంచం ఇవ్వాలంటూ వీఆర్వో కశ్యప్​ డిమాండ్​ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన […]

Read More
పువ్వాడ అజయ్​కుమార్​

కార్పొరేట్​ దవాఖానకు అన్నం దంపతులు

సారథిన్యూస్​, ఖమ్మం: కరోనా బాధితులకు సాయం చేస్తూ, కరోనా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న ప్రముఖ సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు దంపతులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ మద్దులపల్లి కరోనా కేర్​సెంటర్​లో చికిత్సపొందుతున్నారు. అక్కడ వారిని ఎవరూ పట్టించుకోకపోవడం, వైద్యం సరిగ్గా అందకపోవడంతో తమకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పువ్వాడ అజయ్​ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి వీరిద్దరినీ ప్రత్యేక అంబులెన్స్​లో హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్​లోని మమత […]

Read More

వలస గిరిజనులను ఆదుకోండి

సారథిన్యూస్​, ఖమ్మం: వలస గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మద్దిశెట్టి సామేలు డిమాండ్​ చేశారు. సత్తుపల్లి మండలం రేగల్లపాడు గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలుప్రాంతాల్లోని గిరిజనులు పొట్టకూటి కోసం పలు నగరాలకు వెళ్లారు. లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపించాయి. కానీ వారి బాగోగులు పట్టించుకోలేదు. కానీ కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా వారిని ఆదుకోవాలి. తక్షణసాయం కింద వారికి కొంత ఆర్థికసాయం ఇవ్వడంతోపాటు వారికి ఉపాధి […]

Read More
మధిరలో లాక్​డౌన్​

మధిరలో స్వచ్ఛంద లాక్​డౌన్​

సారథిన్యూస్​, మధిర: కరోనా కేసులు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో స్వచ్ఛందంగా లాక్​డౌన్​ విధించాలని ఖమ్మం జిల్లా మధిరలోని వర్తక, వ్యాపార సంఘాలు, అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. ఈ నెల 27 (సోమవారం) నుంచి ఆగస్టు 15 వరకు మధిరలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. మెడికల్​ షాపులకు మినహాయింపు ఇచ్చారు.

Read More
ఉసా మరణం తీరనిలోటు

ఉసా మరణం తీరనిలోటు

సారథిన్యూస్​, ఖమ్మం: బహుజన ఉద్యమకారుడు ఉ. సాంబశివరావు మరణం తీరని లోటని టీజేఏసీ ఖమ్మం జిల్లా కన్వీనర్​ కేవీ కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం ఖమ్మం పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​ ఎదుట ఉసా చిత్రపటానికి నివాళి అర్పించారు. సామాజిక ఉద్యమాలను నిర్మించడంలో ఉసా పాత్ర మరువలేనిదని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐఎం​ఎల్​ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు అశోక్ ఝాన్సీ, ప్రజా సంఘాల నాయకులు బీవీ రాఘవులు, లిక్కి కృష్ణరావు, పాల్వంచ రామారావు, హనుమతురావు దాసరి శ్రీనివాస్, నరేందర్, మధు […]

Read More
రేషన్​ బియ్యం పక్కదారి

రేషన్​ బియ్యం తరలిస్తూ చిక్కారు

సారథి న్యూస్​, ఖమ్మం: రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద 25 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్​ చేశారు. ఖమ్మంలోని పార్శిబందం ప్రాంతానికి చెందిన సీహెచ్​ కృష్ణ, రాము అనే వ్యక్తులు రేషన్​ బియ్యాన్ని రెండు ఆటోల్లో తరలిస్తుండగా.. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వన్​టౌన్​ పోలీస్​స్టేషన్​ సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఖమ్మం అర్బన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని శ్రీరాములు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన 18 […]

Read More