సారథిన్యూస్, ఖమ్మం: బహుజన ఉద్యమకారుడు ఉ. సాంబశివరావు మరణం తీరని లోటని టీజేఏసీ ఖమ్మం జిల్లా కన్వీనర్ కేవీ కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం ఖమ్మం పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ఎదుట ఉసా చిత్రపటానికి నివాళి అర్పించారు. సామాజిక ఉద్యమాలను నిర్మించడంలో ఉసా పాత్ర మరువలేనిదని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు అశోక్ ఝాన్సీ, ప్రజా సంఘాల నాయకులు బీవీ రాఘవులు, లిక్కి కృష్ణరావు, పాల్వంచ రామారావు, హనుమతురావు దాసరి శ్రీనివాస్, నరేందర్, మధు […]
సారథిన్యూస్, ఓయూ: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఓయూ అరణ్యప్రాంతంలోని ఓ రహస్యప్రాంతంలో అమరణ దీక్ష చేపట్టారు. వీరి దీక్షను అడ్డుకొనేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. ఓయూ పరిసరప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతావలయం ఏర్పాటుచేశారు. అయినప్పటికీ జేఏసీ నేతలు పోలీసుల కండ్లుగప్పి ఆందోళన నిర్వహించారు. ఓయూ జేఏసీ నేతల దీక్షకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ సంఘీభావం తెలిపారు. దీక్ష […]
సారథిన్యూస్, గోదావరిఖని: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 2,3,4 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు అన్ని సంఘాలు సన్నద్ధం కావాలని సింగరేణి జేఏసీ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ సమ్మె ద్వారా ప్రధాని మోదీకి కనువిప్పు కలిగించాలని కోరారు. సోమవారం గోదావరిఖనిలో జేఏసీ నాయకులు సమ్మెపోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేల్పుల కుమార్ స్వామి, నరేశ్, ఎంఏ గౌస్, శ్రీనివాస్, తోకల రమేశ్, ఉపేందర్ ఎండీ గని తదితరులు పాల్గొన్నారు.