సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చేరేందుకు ఐదవ విడత అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ప్రిన్సిపాల్ పి.శేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు జనవరి 19వ తేదీలోపు వెబ్సైట్ http://iti.telangana.gov.in లో అడ్మిషన్ పొందాలని సూచించారు. మొదటి నాలుగు విడతల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదివరకే జరిగిన నాలుగు విడతల్లో సర్టిఫికెట్వెరిఫికేషన్కాని విద్యార్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి […]
సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. శనివారం ఆయన రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదావరిఖని ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే గోదావరిఖని ప్రెస్ క్లబ్ చైతన్యానికి మారుపేరుగా నిలిచిందని, తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి జర్నలిస్టు సాగించిన పోరాటం మరువలేనిదన్నారు. మొట్టమొదట […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం సికింద్రాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు హాజరయ్యారు. చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహిళా హక్కుల రక్షణ కోసం కమిషన్ ఆవిశ్రాంతంగా పనిచేయాలని సూచించారు.