Breaking News

Day: April 30, 2021

తప్పుచేయలేదు.. తలొంచను

తప్పు చేయలేదు.. తలొంచను

నేను నిప్పు లాంటోడిని.. చిల్లరమల్లర వాటికి లొంగను ఆ మీడియాలో తప్పుడు కథనాలు ప్రజల్లో పలుచన చేసే కుట్ర నాపై ఆరోపణలకు ఏ విచారణకైనా సిద్ధమే అంతిమ విజయం ధర్మానిదేనని స్పష్టం మీడియా సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్​ సారథి, హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలను తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఖండించారు. విచారణకు దేనికైనా సిద్ధమేనని సవాల్ ​విసిరారు. అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ప్రకటించారు. చిల్లర మల్లర ఆరోపణలకు […]

Read More
ప్రభుత్వాలు, ఎన్‌జీవోలకు సోనూసూద్​రిక్వెస్ట్​

ప్రభుత్వాలు, ఎన్‌జీవోలకు సోనూసూద్ ​రిక్వెస్ట్​

కరోనా కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న సినీనటుడు సోనూసూద్ దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. పల్లె, పట్నం అనే తేడాలేకుండా మహమ్మారి వైరస్ వీరవిహారం చేస్తోంది. ఎంతోమంది కరోనా కాటుకు బలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు సోనూసూద్‌ ఓ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలబడాలని కోరారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో […]

Read More
ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన పునాది

ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన పునాది

ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు సారథి, సిద్దిపేట ప్రతినిధి: ప్రజాస్వామ్య పరిరక్షణకు తప్పకుండా ఓటు వేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 23 వ వార్డులోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ లో ని 69 బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలకు లోబడే ఓటింగ్ జరుగుతుందని, కరోనాను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచినట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు […]

Read More
అత్యంత విలువైన బీమా సంస్థగా ఎల్ఐసీ

అత్యంత విలువైన బీమా సంస్థగా ఎల్ఐసీ

సారథి, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రపంచంలోనే బలమైన మూడో బీమా సంస్థ, పదో అత్యంత విలువైన బీమా బ్రాండ్‌గా నిలిచింది. లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ వెలువరించిన ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని టాప్-100 అత్యంత విలువైన బీమా బ్రాండ్ల మొత్తం విలువ 2020లో రూ. 34.2 లక్షల కోట్ల నుంచి 6 శాతం తగ్గి 2021లో రూ. 32 లక్షల కోట్లకు చేరుకుంది. ‘ఈ ఏడాది […]

Read More
కరోనా టెస్టులకు చెప్పులే క్యూ లైన్​

కరోనా టెస్టులకు చెప్పులే క్యూ లైన్​

సారథి, చొప్పదండి: కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో జనం హడలిపోతున్నారు. కరీంనగర్​జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి టెస్టుల కోసం జనం తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచి మొదలు కుని మధ్యాహ్నం వరకు ఎండలోనే ఉండి టెస్టులు చేయించుకోని పోతున్నారు. శుక్రవారం ఇలా కొంతమంది తమ చెప్పులు, ఇంకొంతమంది ఆధార్​కార్డులను క్యూ లైన్​ఉంచి మరీ పరీక్షలు చేయించుకుంటున్నారు. చివరికి కిట్లు లేవని వైద్యసిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కిట్ల సంఖ్య పెంచాలని […]

Read More
పాస్టర్స్ అసోసియేషన్ ఎన్నిక

పాస్టర్స్ అసోసియేషన్ ఎన్నిక

సారథి, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. పట్టణంలోని షాలోమ్ చర్చిలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఏ.ఎజ్రా మల్లేశం, గౌరవాధ్యక్షుడిగా గుండేటి శాంతి కుమార్, స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా పట్టెం అబ్రహం, ఉపాధ్యక్షుడిగా దేవదాస్, ప్రధాన కార్యదర్శిగా ప్యాట యాది ప్రకాష్, సంయుక్త సంయుక్త కార్యదర్శకులుగా గడ్డం అజయ్ కుమార్, జె.దావీద్, కోశాధికారిగా పాల్ నెల్సన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.దేవయ్య, మీడియా కన్వీనర్లుగా జాన్సన్, […]

Read More
కరోనా బాధితుల పట్ల సర్పంచ్​ ఉదారత

కరోనా బాధితుల పట్ల సర్పంచ్​ ఉదారత

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య కరోనా బాధిత ఆరు కుటుంబాలకు వారానికి సరిపడా నిత్యవసరాలు, కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లు పంపిణీ చేసి ఉదారత చాటుకున్నాడు. ఎవరు భయపడకుండా డాక్టర్లు సూచించిన మందులు వాడాలని ఆయన సూచించారు. మెడిసిన్​ వాడుతూనే పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. గోపాల్​ రావుపేట ఏఎంసీ వైస్ చైర్మన్ తడగొండ అజయ్, పంచాయతీ కార్యదర్శి శిరీష్, టీఆర్ఎస్ నాయకులు తడగొండ నర్సింబాబు, ఆశావర్కర్లు, గ్రామపంచాయతీ […]

Read More
కరోనా టీకాపై అపోహలు వద్దు

కరోనా టీకాపై అపోహలు వద్దు

సారథి, రాయికల్: కరోనా నివారణకు ప్రతిఒక్కరూ టీకాను వేయించుకోవాలని కరీంనగర్​ జిల్లా ఎంపీడీవో ఇనుముల రమేష్​ కోరారు. శుక్రవారం ఆయన స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాను వేయించుకున్నారు. 45 ఏళ్లు నిండిన వారు కరోనా టీకా తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి గాని, కరోనా ర్యాపిడ్ నిర్ధారణ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. టీకాపై ప్రజల్లో నెలకొన్న అపోహలను వైద్యులు తొలగించాలన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ పై […]

Read More