సారథిన్యూస్, రామడుగు: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థుల చదువు భారంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి టీ శాట్- దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు విద్యాబోధన అందిస్తుంది. మంగళవారం తొలిరోజు విద్యార్థులకు టీవీ పాఠాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలకేంద్రంలోని వివిధ గ్రామాల్లో విద్యార్థులు టీవీల ముందు కుర్చొని పాఠాలు విన్నారు. కానీ సిగ్నల్ లేకపోవడం, పవర్పోవడం వంటి సమస్యలు తలెత్తాయి.
సారథి న్యూస్, హైదరాబాద్: మావోయిస్ట్ కీలకనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోనున్నట్టు సమాచారం. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలతో ఆయన చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 74 ఏళ్ల గణపతి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నారు. నడవడానికి వ్యక్తిగత పనులు చేసుకునేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉండడం అసాధ్యమని భావించి ఆయన లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. ఆస్తమా, మోకాళ్లనొప్పి, డయాబెటిస్తో గణపతి బాధపడుతున్నారు. ఆయనను అనుక్షణం ఇద్దరు సహాయకులుగా ఉంటున్నారట. […]
పుట్టాన్‌దొడ్డి(ఇటిక్యాల): ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్‌దొడ్డి శివారులో 171, 172 సర్వేనంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు యత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
భోపాల్: ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రధారణపై మధ్యప్రదేశ్ సర్కార్ ఆంక్షలు విధించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులెవరూ జీన్స్, టీషర్ట్ ధరించి ఉద్యోగానికి రావొద్దని ఉత్తర్వలు జారీచేసింది. జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్‌సౌర్ జిల్లాలోని ఓ అధికారి పద్ధతిగా లేని దుస్తులు (టీ షర్టు) ధరించి హాజరయ్యాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరుకావాలని […]
సారథి న్యూస్, గద్వాల: కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత షేక్ షావలీ ఆచారి విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆరోపించారు. గద్వాల జిల్లాలో తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనారోగ్యంతో ఉన్నవారందరికీ టెస్టులు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు […]
ఢిల్లీ: ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక నుంచి భారత్లో తమ క్యాంపస్లను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ఇకనుంచి విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలోని పలు నగరాల్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయనున్నాయి. అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను భారత్లో నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కాగా ఆయా విద్యాసంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులను వసూలు చేయకుండా ఎన్ఈపీ(నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) కంట్రోల్ చేయనున్నది. […]
వర్మకు జరిమాన విధించిన తెలంగాణ ప్రభుత్వం
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి