Breaking News

CM JAGAN

ముగిసిన అపెక్స్​కౌన్సిల్​మీటింగ్​

ముగిసిన అపెక్స్​ కౌన్సిల్ ​మీటింగ్​

సారథి న్యూస్, హైదరాబాద్: ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న జలవివాదాలతో పాటు ఇటీవల తలెత్తిన నీటి కేటాయింపుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంగళవారం ముగిసింది. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్​రావు హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొనగా, ఢిల్లీలోనే ఉన్న సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి జన్ పథ్-1 అధికారిక నివాసం నుంచి వీడియోలింక్ ద్వారా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఈ కీలక భేటీ రెండు […]

Read More

ఎన్డీఏలో చేరండి.. జగన్​కు ప్రధాని ఆఫర్​!

ఎన్డీఏలో చేరాలని ఏపీ జగన్​ను ప్రధాని మోదీ ఆహ్వానించారా? ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో భాగస్వాములుగా మారి వైఎస్సార్​సీపీ కి చెందిన ఇందరు ఎంపీలకు మంత్రి పదవులు తీసుకోవాలని మోదీ ఒత్తిడి తెస్తున్నారా? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. సీఎం జగన్​ ఢిల్లీ వెళ్లాక జాతీయ మీడియాలో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తున్న వైఎస్సార్​సీపీ త్వరలోనే ఎన్డీఏలో చేరబోతున్నదంటూ వార్తలు వస్తున్నాయి. రెండు వారాల క్రితమే సీఎం […]

Read More
ఈసీ గంగిరెడ్డి మృతికి సంతాపం

గంగిరెడ్డి మృతికి ధర్మాన సంతాపం

సారథి న్యూస్​, నరసన్నపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గంగిరెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎటువంటి ఫీజు తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన గంగిరెడ్డి పేదల డాక్టర్ గా మంచి గుర్తింపు పొందారన్నారు. కడప జిల్లాలో వైఎస్సార్‌ సీపీ ఐలోపేతానికి గంగిరెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. నిత్యం అందుబాటులో ఉండి […]

Read More
గిరిపుత్రులకు భూమిపై హక్కు

గిరిపుత్రులకు భూమిపై హక్కు

సారథి న్యూస్​, శ్రీశైలం/ కర్నూలు: దశాబ్దాల కాలం నుంచి పెండింగ్​లో ఉన్న గిరిజన భూముల భూవివాదాలకు ఆస్కారం లేకుండా అటవీహక్కుల చట్టం మేరకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద రాష్ట్రంలో 1.53 లక్షల మంది గిరిజన రైతులకు 3.12లక్షల ఎకరాల భూమిపై హక్కు పత్రాలను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్​మోహన్‌ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అడవులు, కొండ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన రైతుకు […]

Read More
‘నాడు నేడు’ పనులు కంప్లీట్​ చేయండి

‘నాడు నేడు’ పనులు కంప్లీట్​ చేయండి

సారథి న్యూస్​, కర్నూలు: మహిళ అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో 13 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్​వాడీ కేంద్రంలో ‘నాడు నేడు’ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. చిన్నారులకు ఆహ్లాదమైన వాతావరణం ఉండాలన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘వైఎస్సార్ ​సంపూర్ణ పోషణ’, ‘పోషణ’ కార్యక్రమాలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, డైరెక్టర్ కృత్తికా శుక్లా, జేడీ అడ్మిన్ శ్రీలత, ఆర్​జేడీలు శైలజ, ఉమారాణి, చిన్మయదేవి పాల్గొన్నారు.

Read More
యూపీలో రేపిస్టులను ఉరితీయాలి

యూపీలో రేపిస్టులను ఉరితీయాలి

సారథి న్యూస్, కర్నూలు: దేశంలో దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయని, ఘటన జరిగిన వెంటనే దోషులను పట్టుకుని ఉరితీస్తే తప్పా మార్పు రాదని లీడర్స్‌ యూత్‌ సొసైటీ, దళిత ప్రజాసంఘాల నాయకులు అన్నారు. యూపీలో పదిరోజుల క్రితం ఓ దళిత యువతిని నాలుక కోసి, మెడ, నడుము విరిచి అతిదారుణంగా అత్యాచారానికి పాల్పడిన దుండగులను ఉరితీయాలని డిమాండ్ ​చేస్తూ గురువారం కర్నూలు నగరంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నగర ఎమ్మెల్యే […]

Read More

పక్కాగా.. ఫీవర్ సర్వే

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ఇంటింటి ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని శ్రీకాకుళం మున్సిపల్ అర్బన్ ప్రత్యేక అధికారి టీవీఎస్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నగరంలోని బాకర్ సాహెబ్ పేట, పుణ్యపు వీధి రైతు బజార్,.. సచివాలయ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది నుంచి ఫీవర్ సర్వే రిపోర్టులు అడిగి తెలుసుకున్నారు. సర్వే చేసేటప్పుడు ఏ ఇంటిని మర్చిపోవద్దని సూచించారు.

Read More

వ్యవసాయ బిల్లు.. రైతులకు గుదిబండ

సారథి న్యూస్ శ్రీకాకుళం: కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయబిల్లు పేద రైతులకు గుదిబండ లాంటిదని.. కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని సీపీఐ నేతలు ఆరోపించారు. మంగళవారం కేంద్ర బిల్లులకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో సీపీఐ శ్రేణులు ఆందోళకు దిగాయి. ఈ దీక్షలో సీపీఐ నేతలు బుడితి అప్పలనాయుడు, మన్మధరావు, ద్వారపూడి అప్పలనాయుడు, కూరంగి గోపినాయుడు సీతమ్మ ఆరిక హరిబాబు‌,టొంపల ఆదినారొయణ,ఊయక వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

Read More