తిరువనంతపురం: భారత్‌లో కరోనా సామాజికవ్యాప్తి మొదలైందని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. మనదేశంలో మొదటి కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైంది. అక్కడిప్రభుత్వం లాక్డౌన్ కఠినంగా అమలు చేయడంతో వ్యాధి అంతగా విస్తరించలేదు. దీంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ప్రశంసల వెల్లువెత్తాయి. భారత్‌లో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం సామాజికవ్యాప్తి జరిగిందని చెప్పలేదు. దీంతో విజయన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా శుక్రవారం కేరళలో 791 కొత్త కేసులు నమోదు అయ్యాయి. […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: జీహెచ్ఎంసీకి పరిమితమైందనుకున్న కరోనా మహమ్మారి మారుమూల పల్లెలకు పాకుతున్నది. శుక్రవారం ఒక్కరోజే నాగర్‌కర్నూల్ జిల్లాలో 33 కొత్తకేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో సుధాకర్లాల్ తెలిపారు. నాగర్‌కర్నూల్ పట్టణంలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎస్బీఐలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందికి, సంతబజార్‌కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. వీరితో పాటు అచ్చంపేట పట్టణానికి చెందిన 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. లింగాల మండలం అంబటి పల్లిలో ముగ్గురికి కరోనా సోకింది. […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కొత్తకేసులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 32 వేల కొత్తకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే టెస్టులు సరిగ్గా చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో 9,68,876 కేసులు నమోదయ్యాయి. 6,12,814 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 24, 915 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,31,146 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్ లాంటి […]
ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులో సంఖ్య భయంకర స్థాయిలో పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,429 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,36,181 కి చేరింది. ఈ కాగా ఒకే రోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కరోనాతో 24,309 మంది మృత్యువాత పడ్డారు. 5,92,031 మంది కోలుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో 3,19,840 మంది చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నది. గత 24 గంటల్లో కేవలం 1,246 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత 35 రోజుల్లో ఇంత తక్కువ కేసులు రావడం ఇదే ప్రథమం. కాగా ఇక్కడ కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. 91,312 మంది కరోనా చికిత్సపొంది కోలుకున్నారు. రికవరి రేటు 80.28 శాతం ఉన్నదని వైద్యశాఖ అధికారులు తెలిపారు. అధికంగా టెస్టులు చేయడం, పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్యం చేయడంతోనే కరోనా అదుపులో […]
ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9,06,752 కేసులు నమోదయ్యాయి. గత 20 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రికవరీరేటు ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ కేసులు సంఖ్య పెరుగటం ఆందోళన కలిగిస్తున్నది. గత 24 గంటల్లో 28,000 కొత్తకేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 23,727 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 5,71,459 మందికి కరోనా రోగులకు వ్యాధి నయమైంది. కాగా 3,11,565 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,550 పాజిటివ్‌కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 36,221 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 9 మంది చనిపోగా, ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 365కు చేరింది. వైద్యం అనంతరం 23,679 మంది ఇప్పటిదాకా డిశ్చార్జ్అయ్యారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 926 అత్యధికంగా నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్53, సంగారెడ్డి 19, ఖమ్మం 38, […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో… 1,35,206 మంది పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నది. మరో 1,33,632 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని వైద్యశాఖ వెల్లడించింది. దాదాపు 48.99 శాతం మంది కోలుకుంటున్నట్టు వైద్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఇది శుభపరిణామమే అయినప్పటికీ.. మనదేశంలో గత 24 గంటల్లో 9985 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల […]