సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో తెగిన చెరువులు, చెక్ డ్యాంలను సీపీఐ బృందం గురువారం సందర్శించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నా పట్టించుకొనే నాథుడే లేడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్యపద్మ, జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్, వనేష్, హన్మిరెడ్డి, సుదర్శన్, […]
ఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజూ దేశంలో 60 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. శుక్రవారం ఒక్క రోజే దేశంలో కొత్తగా 61,537 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,88,612కి చేరింది. అలాగే, రికార్డు స్థాయిలో ఒక్కరోజే 933మంది మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 42,518కి పెరిగింది. దేశంలో మరణాల రేటు ప్రస్తుతం 2.05గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మరోవైపు, […]
ముంబై: దేశ ఆర్థికరాజధాని ముంబైలో కరోనా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కేవలం 700 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత మూడు నెలల నుంచి ఇంత తక్కువస్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ‘ఇది చాలా సంతోషిదగ్గ విషయం. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగానే ఉండాలి, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అదేసమయంలో భౌతికదూరం పాటించాలి’ అంటూ ఆ రాష్ట్ర మంత్రి ఆధిత్యథాక్రే ట్వీట్ చేశారు.
ఢిల్లీ : మనదేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత 24 గంటల్లోనే 49,931 కేసులు నమోదయ్యాయి. కేవలం రెండు రోజుల్లోనే 13లక్షల నుంచి కేసుల సంఖ్య 14 లక్షలకు చేరింది. కాగా, దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 32,771 కు పెరిగింది. ఇప్పటివరకు 9,17,567 మందికి రోనా నయం కాగా, ప్రస్తుతం 4,85,114 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 48,916 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,36,861కి చేరుకున్నది. ఇప్పటివరకు కరోనాతో 31,358 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా 8,49,432 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 4,56,071 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. గత 24 గంటల్లో 176 మంది కరోనాతో మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 12,030కి చేరింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 3,18,695 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 8,240 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,75,029 మంది కోలుకున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. దేశంలో అత్యధిక కేసులో మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 2,56,039 శాంపిల్స్ పరీక్షించగా.. వాటిల్లో 40, 421 పాజిటివ్‌గా తేలాయి. వైరస్ బారిన పడి 681 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది. మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా 1265 ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల […]
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. శనివారం రాత్రి వరకు రాష్ట్రంలో 3,00,937 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,348 కొత్త కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11,596 మంది కరోనాతో మృతిచెందారు. కాగా లక్షా 65 వేల మంది వ్యాధినుంచి కోలుకున్నారు. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.