ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మల్లాయిపల్లి బాలిక కుటుంబానికి మందకృష్ణ పరామర్శ సామాజిక సారథి, వనపర్తి: మల్లాయిపల్లి బాలిక లైంగిక దాడి కేసును ఫాస్ట్రాక్కోర్టుకు అప్పగించాలని ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మల్లాయిపల్లి బాలిక కుటుంబాన్ని ఆయన పరమార్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, మహిళలపై లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోయాయని, ఒక వారం రోజుల్లోనే చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల, వనపర్తి జిల్లా మల్లాయిపల్లిలలో […]
సామాజిక సారథి,పెద్ద శంకరంపేట: తన భర్త పెట్టే వేధింపులు తాళలేక అతని భార్య, కూతురు, మరో వ్యక్తితో, కలిసి భర్తను హతమార్చినట్లు అల్లాదుర్గం సీఐ జార్జి, పేట ఎస్ఐ నరేందర్ తెలిపారు. శనివారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత నెల 29న రాత్రి మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎరుకల వెంకయ్య (40)అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదైందన్నారు. ఈ కేసును ఛేదించి విచారించగా కట్టుకున్న భార్య, […]
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రియా చక్రవర్తి 78 మంది పేర్లు చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఈ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్, సారా అలీఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, నమ్రతా శిరోద్కర్ పేర్లు బయటకు వచ్చాయి. వీరందరికీ ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం రకుల్ ప్రీత్‌సింగ్ ఎన్సీబీ ( నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) ఎదుట హాజరైంది. మరోవైపు దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను శుక్రవారం ఎన్సీబీ ప్రశ్నించింది. ఆమె ఎన్సీబీకి […]
అనుమతులు లేకుండా సినిమా షూటింగ్ చేస్తుండటంతో తెలుగు సినీహీరో అల్లూ అర్జున్‌పై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పీఎస్‌లో కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం సందర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే అల్లూ అర్జున్, పుష్ప చిత్ర యూనిట్ కుంటాల జలపాతాన్ని సందర్శించడమే కాక అక్కడికి సమీపంలోని తిప్పేశ్వర్ అటవీప్రాంతంలో షూటింగ్ చేశారు. దీంతో సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్, పుష్ప సినిమా […]
సుశాంత్ కేసులో అరెస్ట్‌యిన రియా చక్రవర్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమెకు కొంతకాలం పాటు జైలు జీవితం తప్పేటట్లు లేదు. రియా చక్రబొర్తి ఆశలు అడియాశలయ్యాయి. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె మరికొన్నాళ్లు జైలులోనే ఉండబోతోంది. ఈ నెల 22 వరకు రియా రిమాండ్ ఖైదీగా ఉండబోతున్నది. మొదటి నుంచి అనేక మలుపులు తిరిగిన సుశాంత్ ఆత్మహత్య కేసు అటుతిరిగి ఇటు తిరిగి రియా […]
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకేసులో దోషిగా తేలిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు రూ. 1 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రశాంత్ భూషణ్.. గత జూన్ 27, 29 తేదీల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వివాదాస్పద ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్లను ఎస్ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. ఆయనపై ‘ధిక్కార మరియు పరువు నష్టం’ కేసులు నమోదు చేసి విచారించింది. ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. సోమవారం తీర్పును వెలువరించింది.
సారథి న్యూస్, వర్ధన్న పేట : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట, రాయపర్తితో పాటు చుట్టు పక్కల గ్రామీణా ప్రాంతాల్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా బ్యాగుల సరఫరాకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుమారు రూ.8.10 లక్షల విలువగల గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వర్ధన్నపేట ఏసీపీ రమేశ్ వివరాలను వెల్లడిస్తూ.. గుమ్మడవెల్లి నాగరాజు అలియాస్ ఉప్పల్ నాగరాజు అలియాస్ తొర్రూరు నాగరాజు అలియాస్ […]
సారథిన్యూస్, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. టీవీ9 సంస్థనుంచి ఆయన భారీగా నిధులను విత్‌డ్రా చేసుకున్నట్టు ఈడీ గుర్తించింది. దాదాపు 18 కోట్ల రూపాయలను రవిప్రకాశ్, మరో ఇద్దరు వ్యక్తులు విత్‌డ్రా చేసినట్టు కేసు నమోదు కావడంతో ఈడీ విచారణ చేపట్టింది. 18 కోట్లను ఆయన ఎక్కడికి తరలించారన్న అంశంపై ఈడీ విచారణ జరుపుతున్నది. ఈ కేసులో రవిప్రకాశ్ ఏ1గా ఉన్నారు.