సారథి న్యూస్, కర్నూలు: వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జేసీలు రవి పట్టన్ షెట్టి, రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్19 నిబంధనలను అనుసరించి జిల్లా ప్రజలంతా ప్రకృతిని, సంస్కృతిని, పర్యావరణాన్ని సమతుల్యం చేస్తూ మట్టి గణపతులను ఇంట్లోనే పెట్టుకుని సంతోషంగా పండుగ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 1,296 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తంగా 45,076 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. రికవరీ అయిన వారి సంఖ్య 30,607కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇలా ఇప్పటివరకు 409 మంది చనిపోయారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 557 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా 111, మేడ్చల్87, సంగారెడ్డి 28, కామారెడ్డి 67, వరంగల్ అర్బన్117, […]
సారథి న్యూస్, కర్నూలు: రాయసీమ ముఖద్వారమైన కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కరోనా క్యాపిటల్‌గా మార్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ఎద్దేవా చేశారు. గ్రామాల్లో సచివాలయాలతో వికేంద్రీకరణ చేసినట్లు ప్రాంతీయ కోవిడ్ ఆస్పత్రులుగా ఏర్పాటుచేస్తే బాగుంటుందన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రిగా కర్నూలు సర్వజన ఆస్పత్రిని మార్చారని, నగరం నడిబొడ్డున ఆస్పత్రి ఉన్నందున వైరస్ ప్రజకు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. కోవిడ్ ప్రాంతీయ […]
సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐగా నిధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కరోనా బారినపడి మంగళవారం మృతిచెందారు. స్థానిక సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీఐ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని ఆయన కితాబిచ్చారు. సీఐ రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం 1,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 32,224 కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 339కు చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 12,680 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా 10,354 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, అందులో 9,076 మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గ్రేటర్ […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా ఉధృతి పెరుగుతోంది. మహమ్మారి 16వేల మార్క్ దాటేసింది. శుక్రవారం ఒకేరోజు 789 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకుమొత్తం 16,934 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 9,096 ఉన్నాయి. వ్యాధిబారిన పడిన 7,632 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 206 మంది మృతి చెందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 149, చిత్తూరు 47, తూర్పుగోదావరి 56, గుంటూరు 80, కడప 19, కృష్ణా 17, […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఒకే రోజు 657 పాజిటివ్‌కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారినుంచి 39, ఇతర దేశాల నుంచి ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఇప్పటి వరకు 15,252 పాజిటివ్‌కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 8,071 ఉన్నాయి. ఇప్పటివరకు 6,988 మంది వ్యాధి బారినపడి డిశ్చార్జ్అయ్యారు. ఇప్పటి వరకు 193 మంది చనిపోయారు. అయితే జిల్లాల వారీగా పరిశీలిస్తే .. అనంతపురం జిల్లాలో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో సోమవారం కొత్తగా 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,005 మంది కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 217గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,452 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 107 […]