ఛత్రపతి శివాజీ సేన పేరుతో ఓ యువకుడి హుకుం సామాజికసారథి, బిజినేపల్లి: ఒకరు ప్రపంచ మేధావి.. దేశానికే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించినవారు. మరొకరు పీడిత ప్రజలకు చదువులు చెప్పించి చైతన్యం నింపిన మహానుభావుడు. ఆ మహనీయులే భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మరొకరు మహాత్మా జ్యోతిబాపూలే. వారిద్దరి మార్గంలో నడవని వారంటూ ఉండరు. ఆ మహనీయుల విగ్రహాలు ఉండని ఊరంటూ లేదు. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్ పల్లిలో పీడిత, బహుజనవర్గాల ప్రజలు […]
ఎస్సైకి నిప్పంటుకున్న వైనం రెండువర్గాలుగా విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు సామాజికసారథి, జోగుళాంబగద్వాల: జిల్లాలోని కేటీదొడ్ది మండలం ఇర్కిచేడులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గురువారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు రెండువర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకూ వినని ఓ వర్గం వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించారు. దీంతో అక్కడే ఉన్న ఎస్సైకి నిప్పంటుకుంది. కాగా ప్రత్యర్థివర్గం వారు వెంటనే […]
డాక్టర్బీఆర్అంబేద్కర్ అద్భుతమైన రచన చేశారు కరోనా వ్యాక్సిన్ అందరూ తీసుకోవాల్సిందే రాజ్‌భవన్ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళసై సామాజిక సారథి, హైదరాబాద్: రాజ్యాంగం వల్లే భారత్బలంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, శ్రీశైలం/కర్నూలు: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయసిద్ధి కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాటు వేశారని, అందుకు వలంటీర్ల వ్యవస్థను నిదర్శంగా భావించవచ్చని కలెక్టర్ జి.వీరపాండియన్ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించకుని సున్నిపెంటలోని గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిపుత్రులకు భూమి హక్కు కల్పించేలా సీఎం నిర్ణయం తీసుకోవడంతో పాటు భూమిహక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టడం […]
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ లాంటి మాస్టర్ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చని కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లలో దరఖాస్తుచేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు http://braou.ac.in/ లేదా https://www.braouonline.in/ వెబ్‌సైట్లలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి 2020 సెప్టెంబర్ […]
సారథి న్యూస్, చారకొండ: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం చంద్రాయన్పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన నాయకులు గడ్డమీది బాల్‌రాం, ఎర్ర గెల్వయ్య, శంకర్, స్వేరోస్ చారకొండ మండలం ప్రధాన కార్యదర్శి పల్లె వెంకటయ్య, డీఎస్ మాస్ చారకొండ మండల డైరెక్టర్ ఎర్ర […]
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా స్వేరో సర్కిల్ ప్రధాన కార్యదర్శిగా వాజేడు మండలానికి చెందిన వాసం వెంకటేశ్వర్లు గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. గ్రామాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యువతను ఉన్నతస్థాయికి చేర్చుతామన్నారు.
సారథి న్యూస్, కర్నూలు: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాదులు దళితులు, మైనార్టీలు, ఇతర కులాల పేదలపై దాడులు పెరిగాయని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు క్ష్మినరసింహా యాదవ్ ఆరోపించారు. సోమవారం నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని పార్టీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 7న అంబేద్కర్ ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. దాడికి నిరసనగా మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు […]