Breaking News

అంబేద్కర్, పూలే విగ్రహాలను తీస్తరా.. లేదా?

అంబేద్కర్, పూలే విగ్రహాలను తీస్తరా... లేదా?

ఛత్రపతి శివాజీ సేన పేరుతో ఓ యువకుడి హుకుం

సామాజికసారథి, బిజినేపల్లి: ఒకరు ప్రపంచ మేధావి.. దేశానికే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించినవారు. మరొకరు పీడిత ప్రజలకు చదువులు చెప్పించి చైతన్యం నింపిన మహానుభావుడు. ఆ మహనీయులే భారతరత్న డాక్టర్ ​బీఆర్ ​అంబేద్కర్, మరొకరు మహాత్మా జ్యోతిబాపూలే. వారిద్దరి మార్గంలో నడవని వారంటూ ఉండరు. ఆ మహనీయుల విగ్రహాలు ఉండని ఊరంటూ లేదు. ఈ క్రమంలో నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్ పల్లిలో పీడిత, బహుజనవర్గాల ప్రజలు ప్రతిష్టించారు. ఇది గిట్టని ఛత్రపతి శివాజీ సేన పేరుతో సీహెచ్ ​మహేశ్ అనే ఓ యువకుడు ఇక్కడి విగ్రహాలను తొలగించాలని సర్పంచ్, గ్రామపంచాయతీ సెక్రటరీకి ఏకంగా ఫిర్యాదు చేశాడు. ఇది సోషల్ ​మీడియా వైరల్ ​అవుతూ వివాదాస్పదంగా మారింది. “గ్రామంలో కలతలు లేని సామరస్యాన్ని కోరుతున్నాం. గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం ఖరారు. కానీ అది ఎక్కడ ఏర్పాటు చేయాలనేది మాత్రం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీ నిర్ణయంలో మార్పు రాకపోతే మా నిర్ణయంలో కూడా మార్పు ఉండదు..” అంటూ విగ్రహాలను ప్రతిష్టించిన వారిని హెచ్చరిస్తున్నారు. దీంతో గ్రామంలో ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

అధికారులకు ఇచ్చిన వినతిపత్రం

3 thoughts on “అంబేద్కర్, పూలే విగ్రహాలను తీస్తరా.. లేదా?

  1. మీకు గ్రామంలో జరిగిన సంఘటనలపైన అవగాహన లేకుండా
    నిజం తెలుసుకోకుండా వార్తను రాశారు . గ్రామస్తులు మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు వ్యతిరేకం కాదు,వారు విగ్రహాల ఏర్పాటుకు ఎంచుకున్న ప్రదేశానికి వ్యతిరేకం, 4 సంవత్సరాల క్రితమే మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర రహదారి పక్కన గల బస్టాండ్ అవరణలో విగ్రహాల ఏర్పాటుకు దిమ్మెను నిర్మించడం జరిగింది.గ్రామంలో కొందరు అవగాహన రాహిత్యంగా వారి ఇష్టానికి గ్రామ సమస్యలు పరిష్కరించుకునే చోట పూలే, అంబేద్కర్ గారి విగ్రహాలను ఏర్పాటు చేసి పూర్తిగా గ్రామస్తులకు అసౌకర్యం కల్పించారు .దీనిని వ్యతిరేకిస్తూ గ్రామ పంచాయతీ అధికారులకు వినతి పత్రము ఇస్తే మీరు హుకుం జరిచేసినట్లు వార్తను రాశారు ..మీరు రాసిన వార్తను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా…

  2. ఇసుక మాఫియా తో కుమ్మక్కై మీరు చేసే అక్రమాలు త్వరలోనే భయటపెడతా…

Comments are closed.