కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వారణాసి: లోక్‌సభలో అరుదుగా మాట్లాడే కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియాగాంధీ అత్యంత కీలకప్రశ్నను లేవనెత్తారు. సీబీఎస్‌ఈ 10వ తరగతి సిలబస్‌తో పాటు పరీక్షలో వచ్చిన అంశాన్ని లేవనెత్తారు. దేశ మహిళలను కించపర్చే విధంగా ఈ ప్రశ్న ఉందని, సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఈ ప్రశ్న ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. మహిళలకు మితిమీరిన స్చేచ్ఛ వల్లే దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని , మహిళలు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పిల్లలు చెడిపోతున్నారని సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాటు పరీక్షలో క్వశ్చన్‌రావడంపై […]
రైతు అంశాలపై ప్రధాని మోడీ నిర్లక్ష్యం మద్దతు ధరలు, పరిహారం విషయంలో స్పందనలేదు పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా ఆగ్రహం న్యూఢిల్లీ: రైతుల అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుబట్టారు. రైతు సమస్యలు, సామాన్య ప్రజల విషయంలో ఎలాంటి స్పందన లేని రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టపరమైన హామీ, మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు కాంగ్రెస్ బాసటగా నిలుస్తుందని […]
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)భావజాలం కలిగిన నేతలు ఎవరైనా కాంగ్రెస్ లో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. శుక్రవారం జూమ్ ద్వారా నిర్వహించిన సోషల్ మీడియా విభాగం కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. సంఘ్ భావజాలం ఉన్న కాంగ్రెస్ నేతలకు తలుపులు తెరిచే ఉన్నాయని, ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవచ్చన్నారు. ‘ఇక్కడ చాలా మంది […]
సారథి, రామడుగు: ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నరాజ మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట బాపిరాజు, రామడుగు గ్రామాధ్యక్షుడు సముద్రాల […]
సారథి ప్రతినిధి, జగిత్యాల: ఏఐసీసీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ సంయుక్తంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు స్థానిక ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక సివిల్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్ […]
ఉద్దండాపూర్ గ్రామస్తులకు న్యాయం చేయాలి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రైతులతో ముఖాముఖి సారథి న్యూస్, జడ్చర్ల: నాటి ఇందిరమ్మ ప్రభుత్వం దళిత, గిరిజన పేదప్రజలకు భూములు ఇస్తే సీఎం కేసీఆర్ గుంజుకుంటున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో పర్యటించారు. రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దండాపూర్ గ్రామస్తులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని […]
న్యూఢిల్లీ: దేశచరిత్రలోనే ఇండియా మొదటిసారి ఆర్థిక మాంద్యంలోని అడుగుపెట్టబోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోడీ అవలంభిస్తున్న విధానాల కారణంగానే బలంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా మారిందని విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఎలా కొట్టుమిట్టాడుతుందో న్యూస్ పేపర్లలో వచ్చిన రిపోర్టులను జతచేశారు. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ నాయకుడు […]
ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు ఆ పార్టీ అధిష్ఠానం గట్టి షాకే ఇచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆజాద్‌ను తొలిగించింది. ఆజాద్‌తో పాటూ అంబికా సోని, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్ వోరా తదితరులపై కూడా వేటు పడింది. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన అవసరం అంటూ ఇటీవల ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖరాసిన వారిలో ఆజాద్ ముఖ్యుడు. ఈ విషయంపై పార్టీలో తీవ్ర […]