Breaking News

TELANGANA

కేసులు తగ్గుతున్నా.. వ్యాప్తి ఆగట్లే..

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రికవరీలు పెరుగుతున్నా.. గతనెలతో పోల్చితే రోజూవారీ కేసులలో తగ్గుదల కనిపిస్తున్నా.. వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. రోజూ 75 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. సోమవారం నమోదైన కొత్త కేసుల (74,441) తో కలిపి.. భారత్ లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,815 కు చేరుకున్నది. మరోవైపు మరణాల సంఖ్య కూడా ఇటీవలే లక్ష దాటింది. గత 24 గంటల్లో మరణించిన 903 మందితో కలిపి… దేశంలో […]

Read More

ఫేసులకు కాదు.. బండ్లకు పెడుతున్నారు మాస్కులు

హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నివారించడానికని తీసుకొచ్చిన మాస్కులను ముఖానికి ధరించాలని ప్రభుత్వాలు.. వైద్యులు చెబుతుంటే పలువురు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ‘అది మమ్మల్ని ఏమీ చేయదు.. కరోనా వస్తే మాకేంటి..?’ అనే రీతిలో నడుచుకుంటున్నారు. హైదరాబాద్ లో అయితే పలువురు ఆకతాయిలైతే.. నిఘా కెమెరాలను, పోలీసుల ఈ ఛాలన్ల నుంచి తప్పించుకోవడానికి కూడా మాస్కులనే వాడుతున్నారు. అదేంటి.. మాస్కులకు, ఈ ఛాలన్లకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదవాల్సిందే.. హెల్మెట్ లు పెట్టుకోకుంటే […]

Read More

యోగీ దిగిపో..!

సారథి న్యూస్, రామగుండం: హథ్రాస్​లో జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని దళితసంఘాలు డిమాండ్​ చేశాయి. బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ దళితులను దగా చేస్తున్నదని దళితసంఘాల నేతలు ఆరోపించారు. యూపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? మానవహక్కులు ఉన్నాయా? ప్రజాస్వామ్యదేశంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం నిస్సుగ్గుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం గోదావరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల యాక్షన్ కమిటీ […]

Read More

వ్యవసాయ బిల్లు.. రైతులకు గుదిబండ

సారథి న్యూస్​, వెంకటాపురం: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు గుదిబండ లాంటిదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఏఐసీసీ పిలుపుమేరకు ములుగు జిల్లా నుగూరు వెంకటాపురం మండలకేంద్రంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు అధాని, అంబానీ కోసమేనని విమర్శించారు. బిల్లు ప్రకారం సప్లై చైన్ లో రైతులనుంచి రీటైలర్ వరకూ ఎవరు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ […]

Read More

పెండింగ్​ బకాయిలు ఇప్పించండి

సారథి న్యూస్, రామగుండం: తమకు వేతనాలు ఇప్పించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పీఆర్​పీ కోరారు. ఈ మేరకు వారు రామగుండం మున్సిపల్​ కమిషనర్​ ఉదయ్​కుమార్​కు వినతిపత్రం సమర్పించారు. జీతాలు లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్​ ఉన్నారు.

Read More

కాంగ్రెస్​ను బలోపేతం చేద్దాం

సారథి న్యూస్, రామడుగు: కాంగ్రెస్​ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు కవ్వం పల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. కాంగ్రెస్​పార్టీ కిసాన్​సెల్​ ఉపాధ్యక్షుడిగా సయిండ్ల నర్సింగం, అధికార ప్రతినిధిగా కాడే శంకర్​ను నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు వారికి శనివారం నియామకపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Read More
వైఎస్సార్​సీపీ, టీడీపీ ఘర్షణ

నరసన్నపేటలో టీడీపీ, వైఎస్సార్​సీపీ ఘర్షణ

సారథిమీడియా, శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట పోలీస్​స్టేషన్​ రణరంగంగా మారింది. వైసీపీ, టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. శనివారం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్​ను అరెస్ట్​ చేయాలని టీడీపీ శ్రేణులు నరసన్న పేట పోలీస్​స్టేషన్​ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ధర్మానకు మద్దతుగా వైఎస్సార్​సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పోలీసులు రంగప్రవేశం […]

Read More

కట్నం తేస్తేనే కాపురానికి రా..

సారథి న్యూస్​, శ్రీకాకుళం: న్యాయం చేయాలంటూ ఓ యువతి శ్రీకాకుళం మహిళా పోలీసులను ఆశ్రయించింది. కట్నం తీసుకొస్తేనే కాపురానికి రావాలంటూ భర్త, అత్తమామ.. ఇంటి నుంచి గెంటేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన శిరీష , తన సమీప బంధువైన చంద్రశేఖర్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. చంద్రశేఖర్​ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో కట్నం తేవాలని వారు ఒత్తిడి తెస్తున్నారని శిరీష ఆరోపించింది. తనకు న్యాయం […]

Read More