బీజేపీ ఎంపీలను ప్రశ్నించిన మంత్రి కె.తారకరామారావు సారథి న్యూస్, హైదరాబాద్: మానవ తప్పిదాలతో చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో ఇటీవల కురిసిన భారీవర్షాలకు విశ్వనగరం హైదరాబాద్ నీట మునిగిందని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నష్టాన్ని నివారించగలిగామని అన్నారు. వరదల సమయంలో తక్షణ రక్షణ […]
ఎన్డీఏలో చేరాలని ఏపీ జగన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారా? ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో భాగస్వాములుగా మారి వైఎస్సార్సీపీ కి చెందిన ఇందరు ఎంపీలకు మంత్రి పదవులు తీసుకోవాలని మోదీ ఒత్తిడి తెస్తున్నారా? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాక జాతీయ మీడియాలో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తున్న వైఎస్సార్సీపీ త్వరలోనే ఎన్డీఏలో చేరబోతున్నదంటూ వార్తలు వస్తున్నాయి. రెండు వారాల క్రితమే సీఎం […]
నదీ జలాల విషయంలో కావాలనే ఏపీ కయ్యం నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకుని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం […]
సారథి న్యూస్, రామడుగు/ రామాయంపేట /చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పేద ప్రజలకు గుదిబండ అని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు మురళి విమర్శించారు. ఎల్ఆర్ఎస్ను నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పేరుతో తీసుకొచ్చిన జీవో 131 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ […]
న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి కరోనా సోకి మరణించారు. లక్షణాలేమీ లేకున్నా (అసింప్టమేటిక్) కరోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన ఆయన.. బుధవారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయనకు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తడంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వల్ల మరణించిన తొలి కేంద్ర మంత్రి ఆయనే. కర్నాటకకు చెందిన సురేశ్ అంగడి.. బెల్గావి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు […]
ఢిల్లీ: తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ నిన్న రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదించిన సంగతి చెలరేగింది. బిల్లు చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో చైర్మన్ పోడియం దగ్గరకు వెళ్లి పెద్దపెట్టు నినాదాలు చేశారు. కాగా సభలో అనుచితంగా ప్రవర్తించిన ఎనిమిది మంది ఎంపీలపై సోమవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ వేటు వేశారు. వారంపాటు వీరిని సభనుంచి బహిష్కరించారు. సోమవారం సభ ప్రారంభంకాగానే మంత్రి ప్రహ్లద్జోషి సస్పెన్షన్ […]
ప్రధాని నెమలితో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు ప్రధానమంత్రి మోడీపై రాహుల్ ఫైర్ న్యూఢిల్లీ : ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. మోడీ నెమళ్లతో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారనీ, ప్రజలంతా ఎవరి జీవితాలను వారే కాపాడుకోవాలని సూచించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘భారత్‌లో కరోనా కేసులు ఈ వారంలో 50 లక్షలు చేరుకోనున్నాయి. ఒక వ్యక్తి ఆహాన్ని సంతృప్తి పరుచుకునేందుకు […]
ఢిల్లీ: ఇటీవలే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్రహోం మంత్రి అమిత్ షా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఎయిమ్స్‌కు తరలించారు. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పాటిజివ్ గా నిర్ధారణ అయ్యింది. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందిన ఆయన 14న డిశ్చార్జి అయ్యారు. అయితే ఆగస్టు 18న అయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎయిమ్స్‌లో […]