మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సారథి న్యూస్, మానవపాడు: మూడు రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్లో ఆమోదించి రైతులను రోడ్ల పైకి వచ్చేలా చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్సంపత్కుమార్ అన్నారు. మంగళవారం రైతు సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమాన్ని అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు రోడ్డుపైనే బైఠాయించి వంటావార్పుతో అక్కడే భోజనాలు చేశారు. ‘మోడీ.. కేడి, బీజేపీ హఠావో.. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో తన పొలం నుంచే తెలంగాణ వాదాన్ని వినిపించిన రైతు పనికర మల్లయ్య తన కుమార్తె పెళ్లి ఆహ్వాన పత్రికను తీసుకుని హైదరాబాద్‌కు వచ్చి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా సోమవారం ప్రగతిభవన్ లో అందజేశారు. వేడుకలకు ముఖ్యమంత్రిని రావాల్సిందిగా కోరగా.. వారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను కోరుకున్న రైతు తెలంగాణను నడిపిస్తున్నారనే సంతోషంతో నాటి ఉద్యమ సారథి సీఎంను తన కూతురు […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రచురించిన వృక్షవేదం పుస్తకాన్ని సీఎం కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ సంపాదకత్వంలో మామిడి హరికృష్ణ రచించారు. పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను సీఎం కేసీఆర్అభినందించారు. వృక్షాలను ధైర్యంగా భావించే సంస్కృతి మనదని గుర్తుచేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో వరద సహాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరద సహాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్ ధ్రువీకరణ జరుగుతుందని, ఆ తర్వాత వారి అకౌంట్ లోనే వరద సహాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈనెల 7వ తేదీ నుంచి సాయం అందని వారికి మళ్లీ […]
సారథి న్యూస్, నకిరేకల్: నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొని భౌతికకాయానికి నివాళులు అర్పించారు. నర్సింహ్మయ్య కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మహమూద్ అలీ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ రాష్ట్ర రైతు […]
సారథి న్యూస్, మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్, హవేలీ ఘనపూర్ మండలాలకు సంబంధించిన 35 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని […]
సారథి న్యూస్, హైదరాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల కన్నుమూశారు. బుధవారం మాక్లూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో నిర్వహించిన ద్వాదశ దినకర్మలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయన అక్కడికి నేరుగా వెళ్లి ఎమ్మెల్యే గణేష్ గుప్తా కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంతకుముందు కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం వెంట హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, […]
తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేసిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మార్క్సిస్టు దృక్పథంతో ప్రజాసమస్యలపై పాలకులను నిలదీసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య(64) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండగా వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. నోముల 30ఏళ్లకు పైగా రాజకీయ, ప్రజాజీవితంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. 1987లో జరిగిన మండల […]