సారథి, మానవపాడు: నడిగడ్డలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. బీజేపీ మానవపాడు మండలాధ్యక్షుడిగా గొల్ల విజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే భారీఎత్తున జిల్లాలో చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషిచేస్తానని విజయ్ […]
సారథి, మానవపాడు: కేవలం ఏడు నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్ కావడంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయానికి ఓ సాధారణ వ్యక్తిలా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ధరణి రైతులకు ఒక వరమని, మధ్యవర్తులు, బ్రోకర్ల ప్రమేయం లేకుండా మీ సేవకు వెళ్లి ధరణి పోర్టల్ లో ఆన్లైన్చేసుకుంటే ఈజీగా రిజిస్ట్రేషన్అయిందని గుర్తుచేశారు. ధరణి సేవలను తెలుసుకునేందుకే సాధారణ వ్యక్తిలా వచ్చానని తెలిపారు.
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: పక్షులు, కోళ్లను బర్డ్‌ఫ్లూ మహమ్మారి కబళిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీ రైతులను వణికిస్తోంది. క్రమంగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా బర్డ్‌ఫ్లూ మహమ్మారి పాకినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో ఉన్నట్టుండి 20 నుంచి 30 నాటుకోళ్లు ఒకేరోజు చనిపోవడం కలకలం రేపింది. ఈ కోళ్లకు బర్డ్‌ఫ్లూ వచ్చిందా? మరేదైనా కారణమా? అని బాధిత పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత […]
సారథి న్యూస్, మల్దకల్(జోగుళాంబ గద్వాల): ఆ ఊరు వాసులు తిరుపతి వెళ్లరు.. గ్రామస్తులు భవనం రెండవ అంతస్తు కూడా నిర్మించరు.. కాదని ఎవరైన నిర్మాణానికి పూనుకుంటే అనర్థాలు జరిగిపోతాయని అందరిలోనూ అనమానం. స్థానికంగా వెలసిన తిమ్మప్పస్వామిని తమ ఇష్టదైవంగా కొలుస్తారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదిశిలాక్షేత్రమైన మల్దకల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కొలిచేవారి కొంగుబంగారంగా వెలుగొందుతున్నాడు. భక్తులను అలరిస్తూనే వారి కోరికలు నెరవేర్చుతున్నాడు.28 నుంచి ఉత్సవాలుఏటా మార్గశిర మాసంలో జరిగే ఉత్సవాలకు పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులు తమ […]
మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సారథి న్యూస్, మానవపాడు: మూడు రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్లో ఆమోదించి రైతులను రోడ్ల పైకి వచ్చేలా చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్సంపత్కుమార్ అన్నారు. మంగళవారం రైతు సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమాన్ని అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు రోడ్డుపైనే బైఠాయించి వంటావార్పుతో అక్కడే భోజనాలు చేశారు. ‘మోడీ.. కేడి, బీజేపీ హఠావో.. […]
సారథి న్యూస్, అలంపూర్ (జోగుళాంబ గద్వాల): ఈనెల 20వ తేదీ నుంచి జరిగే తుంగభద్ర నది పుష్కరాల నేపథ్యంలో ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ సోమవారం అలంపూర్ లోని పుష్కర ఘాట్ ను, జోగుళాంబ ఆలయాల సముదాయాన్ని సందర్శించారు. పుష్కర ఘాట్ ప్రాంతంలో వీఐపీ పార్కింగ్, సాధారణ భక్తుల వాహనాలకు పార్కింగ్, అలాగే వృద్ధులు, దివ్యాంగులకు కల్పించే ఉచిత పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అమ్మవారి ఆలయం, స్వామివారి ఆలయంలోకి వచ్చే మార్గాలు, బయటకు వెళ్లే మార్గాలను గుర్తించి […]
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి గ్రామంలో మాజీ ఎంపీపీ జయమ్మ ప్రకాష్ గౌడ్ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తుంగభద్ర నదికి […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామంలో భారీవర్షానికి గ్రామానికి చెందిన బోయ నడిపి ఉషన్న ఇల్లు శనివారం రాత్రి కూలిపోయింది. సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయంగా రూ.రెండువేలు అందజేశారు. బాధిత కుటుంబసభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట భాస్కర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.