ఘాట్‌రోడ్డులో ఘోరప్రమాదం నలుగురు దుర్మరణం 19 మందికి గాయాలు బాధితులు హైదరాబాద్ వాసులు విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అరకు ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న టూరిస్టు బస్సు ఐదో నంబర్ మలుపు వద్ద బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది పర్యాటకులు ఉండగా.. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 19 మందికి గాయాలైనట్లు అనంతగిరి ఎస్సై తెలిపారు. పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి […]
సారథిన్యూస్, విశాఖపట్నం: ‘మేము మూడు రాజధానులకు ఒప్పుకోం.. అమరావతే ఆంధ్రుల రాజధాని’ అని మంకుపట్టు పట్టిన టీడీపీకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ఇప్పటికే విశాఖకు చెందిన పలువురు నేతలు టీడీపీని వీడి వైఎస్సాఆర్ కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారని సమాచారం. గణేశ్‌తో పాటు మరో ఎమ్మెల్యే కూడా చంద్రబాబుకు వీడ్కోలు చెప్పనున్నారట. గణేశ్.. కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆదివారం ఆయన సీఎం […]
సారథి న్యూస్, విశాఖపట్నం: వరుస ప్రమాదాలతో విశాఖపట్నం వణికిపోతోంది. తాజాగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నౌకలో మరో అగ్నిప్రమాదం జరిగింది. వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్‌లో నౌకలో ఇంజన్ రూమ్ నుంచి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన పోర్టు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంజన్ రూమ్‌లో కావడంతో గ్యాస్ మాస్కులు ధరించి సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోర్ట్ అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా, శనివారం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం […]
ఆశ వర్కర్ల చేత అక్రమ రవాణా…గుట్టు రట్టు సారథి న్యూస్ విశాఖపట్నం : విశాఖలో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మద ఆధ్వర్యంలో చిన్నపిల్లల అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పిల్లలను పోషించే స్థితిలో లేని తల్లి దండ్రులను టార్గెట్ చేసి అమ్మకాలు చేస్తున్నట్టు తేలింది. తల్లిదండ్రులకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పుట్టిన తరువాత పిల్లలను తరలిస్తున్నట్టు గుర్తించారు. పిల్లలను అక్రమరవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. […]
అనంత, విశాఖ జిల్లాల్లో కలకలం సారథి న్యూస్, అనంతపురం: మిడతల దండు రైతులను కలవరవపెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో రెండు రోజుల క్రితం ఓ మిడతల దండు కనిపించింది. అలాగే విశాఖపట్నం జిల్లా కశింకోట మండలంలో కూడా పంటలపై ఈ దండు వాలింది. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా వివిధ పంటలపై దాడిచేస్తోంది. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో జిల్లేడు చెట్లపై మిడతల గుంపు వాలింది. వాటి సంచారంపై స్థానికులు, రైతులు అగ్రికల్చర్ […]
విశాఖలో స్టైరీన్ గ్యాస్ లీకేజీతో 11 మంది మృత్యువాత భయపెడుతున్న లీకేజీ ఉదంతాలు మరుపురాని భోపాల్ దుర్ఘటన సారథి న్యూస్, అనంతపురం: మానవ తప్పిదాలతో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటిదే విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టైరీన్ విషవాయువు లీకేజీ ఘటన. ఈ దుర్ఘటనలో 11మంది మృత్యువాతపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎంతోమంది గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున సాంకేతిక లోపంతో ట్యాంకు నుంచి ఆవిరి, పొగ రూపంలో ఈ విషవాయువు కమ్ముకొచ్చింది. […]