మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సారథి న్యూస్, మానవపాడు: మూడు రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్లో ఆమోదించి రైతులను రోడ్ల పైకి వచ్చేలా చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్సంపత్కుమార్ అన్నారు. మంగళవారం రైతు సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమాన్ని అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు రోడ్డుపైనే బైఠాయించి వంటావార్పుతో అక్కడే భోజనాలు చేశారు. ‘మోడీ.. కేడి, బీజేపీ హఠావో.. […]
సారథి న్యూస్, నెట్ వర్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా రైతుసంఘాల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. జోగుళాంబ జిల్లా ఉండవల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తా సమీపంలోని హైదరాబాద్– బెంగళూర్ హైవే పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులతో కలిసి నిరసన చేపట్టారు. రాష్ట్ర కన్స్యూమర్ ఫోరం చైర్మన్ తిమ్మప్ప, జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, […]
సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే హైదరాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. సిటీలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్నారు. ‘నిజాం సంస్కృతిని వదిలి.. నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం.. కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు వెళ్దాం.. అవినీతి నుంచి పారదర్శక పాలన తీసుకొద్దాం.. సంతుష్టీకరణ నుంచి సమష్టి అభివృద్ధి వైపు పయనిద్దాం..’ అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు ఆదివారం […]
న్యూఢిల్లీ: దేశచరిత్రలోనే ఇండియా మొదటిసారి ఆర్థిక మాంద్యంలోని అడుగుపెట్టబోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోడీ అవలంభిస్తున్న విధానాల కారణంగానే బలంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా మారిందని విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఎలా కొట్టుమిట్టాడుతుందో న్యూస్ పేపర్లలో వచ్చిన రిపోర్టులను జతచేశారు. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ నాయకుడు […]
సారథి న్యూస్, మహబూబాబాద్: ప్రధాని మోడీ పాలనలో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర అన్నారు. బీజేపీ ప్రభుత్వం మనువాద వ్యవస్థను పెంచి పోషిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను నాశనం చేసేలా ఉన్నాయని ఆక్షేపించారు. రైతుల బతుకులు దుర్భరంగా మారబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మహబూబాబాద్‌లోని ఆర్టీ గార్డెన్ లో ‘భారతదేశం కమ్యూనిస్టు ఉద్యమం.. వందేళ్ల ప్రస్థానం’ అనే అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయిలో సదస్సులో […]
న్యూఢిల్లీ: అన్‌లాక్-6.0 కొత్త నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నందున సెప్టెంబర్ 30న ఇచ్చిన ఆదేశాలను మరోనెల రోజులు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా విస్తరణ ఇంకా కొనసాగుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్రం సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టంచేసింది. కంటైన్మెంట్ జోన్ల బయట… దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. కంటైన్మెంట్ జోన్ల బయట రాష్ట్రాలు లాక్డౌన్విధించకూడదని తాజా మార్గదర్శకాల్లో చెప్పింది. […]
ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కు కూడా.. క్వారంటైన్ కి వెళ్లిన యూఎస్ అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ న్యూయార్క్: మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగలింది. ట్రంప్ తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ […]
సారథి న్యూస్, కల్వకుర్తి: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ.. దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో యువజన, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి మహబూబ్‌నగర్ చౌరస్తా మీదుగా హైదరాబాద్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో దళిత మహిళలపై వరుసగా […]