Breaking News

పాలమూరు

పాలమూరులో బీజేపీ పాగాకు యత్నం

సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకుని పాలమూరులో పట్టుసాదించాలని ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా కేంద్రంలో ఆపార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలు పాలక నేతల పై కార్యక్రమాలు చేస్తు రాష్ట్ర నేతలు ప్రెస్ మీట్ నిర్వహించడం, లోకల్, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ విధానాలకు పాల్పడి నిర్భందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పేరు తో దోపిడీ చేస్తున్నాదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చడం […]

Read More

పాలమూరుకు డీపీఆర్ ఏది?

– కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజెక్టులపై ఎందుకు లేదు– ఆర్డీఎస్‌ విషయంలో హామీ ఏమైంది– కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ సామాజికసారథి, జోగుళాంబ గద్వాల: రాష్ట్రంలో అత్యంత అవినీతిపాలన నడుస్తోందని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా డిమాండ్‌ చేస్తున్న కేసీఆర్‌ ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి డీపీఆర్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నీటి కేటాయింపులు లేకుండా జాతీయహోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. […]

Read More
‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం

‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం

రాతిపెడ్డలు కూలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: పాలమూరు ఎత్తిపోతల పథకం సొరంగం పనుల్లో రాయి కూలి వ్యక్తి మృతిచెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలో పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా సొరంగం (టన్నెల్) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా, ఉయ్యాలవాడకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గొంది శ్రీనివాస్ రెడ్డి రోజూ లాగే నీళ్ల ట్రాక్టర్ తీసుకొని […]

Read More
కందనూలులో ‘మట్టి పాలిటిక్స్’​

కందనూలులో ‘మట్టి పాలిటిక్స్’​

వరంగా మారిన ‘పాలమూరు ఎత్తిపోతల’ పనులు కాంట్రాక్టర్లకు చెరువులను రాసిస్తున్న నాయకులు తాజాగా ఓ నేత వ్యవహారం వెలుగులోకి… నల్లమట్టి కోసం వర్గాలుగా విడిపోతున్న నేతలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్​కర్నూల్ ​జిల్లాలో నల్లమట్టి సిరులు కురిపిస్తోంది. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొంతమంది రాజకీయాలకు వరంగా మారింది. జిల్లాలోని బిజినేపల్లి మండలంలో మట్టి పాలిటిక్స్​నడుస్తున్నాయి. మండలంలో ప్రధాన పార్టీల నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకున్నది. ఆ పార్టీలో ఇప్పుడు వర్గాలపోరు తీవ్రమవడంతో నాయకులు, […]

Read More
పాలమూరు– రంగారెడ్డి అగమ్యగోచరం

‘పాలమూరు– రంగారెడ్డి’ అగమ్యగోచరం

సందిగ్ధంలో భారీ ఎత్తిపోతల పథకం ప్రారంభం నుంచీ ప్రాజెక్టుకు అవాంతరాలే తాజాగా పర్యావరణ అనుమతులు లేవని ట్రిబ్యునల్​స్టే నీటి కేటాయింపుల్లేవు.. ప్రాజెక్టుకు అనుమతుల్లేవు నిపుణులు హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వపెద్దలు ఇదీ ‘పాలమూరు’ స్వరూపంప్రారంభ అంచనా వ్యయం: రూ.50వేల కోట్లుపెరిగిన అంచనా వ్యయం: రూ.లక్ష కోట్లుసాగునీటి అంచనా: 10లక్షల ఎకరాలుపంపులు: 5పొడవు: 1000 కి.మీ.ఇప్పటివరకు ఖర్చు: రూ.50వేల కోట్లు -గంగు ప్రకాశ్​, ప్రత్యేక ప్రతినిధి, సామాజిక సారథి కరువు ఛాయలు అలుముకున్న పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో కృష్ణాజలాలను పారించి […]

Read More
ఏపీ అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి ఎడారే

ఏపీ అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి ఎడారే

లంకలో అంతా రాక్షసులే ఉంటారని నిరూపించిన ఏపీ సీఎం జగన్​ నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి ధ్వజం సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: లంకలో అంతా రాక్షసులే ఉంటారని ఏపీ సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి నిరూపించారని నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పాలిట గాడ్సేగా మారాడని విమర్శించారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిలా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగం ఉసురు తగిలితే జగన్ ఇంటికి పోవడం ఖాయమన్నారు. శనివారం ఆయన […]

Read More
కరోనా బాధితులపై ఎన్నారైల ఉదారత

కరోనా బాధితులపై ఎన్నారైల ఉదారత

సారథి, బిజినేపల్లి: కరోనా బాధితులు, వారి కుటుంబాలపై ఎన్నారైలు తమ ఉదారత చాటుకున్నారు. పాలమూరు ఎన్నారైల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం, తిమ్మాజిపేట ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో కరోనా కిట్లు పంపిణీ చేశారు. వైద్యసిబ్బంది, ఆశావర్కర్లకు మాస్కులు, పీపీఈ కిట్స్, థర్మల్ స్కానర్స్, పల్స్ ఆక్సిమీటర్స్ తో పాటు ఇతర పరికరాలు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారైల ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజికసేవ అందరికీ […]

Read More
ప్రశ్నించే గొంతుకను గెలిపించండి

ప్రశ్నించే గొంతుకను గెలిపించండి

సారథి న్యూస్, జడ్చర్ల: మహబూబ్​నగర్​, హైదరాబాద్​, రంగారెడ్డి గ్రాడ్యుయేట్​ ఇండిపెండెంట్​ ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరికి మద్దతుగా జడ్చర్ల, మహబూబ్​నగర్​లో ‘ఇంటింటికీ ప్రశ్నించే గొంతుక’ అనే కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మహబూబ్​ నగర్ జిల్లాలో ప్రచారం చేశారు. పట్టభద్రులు, విద్యార్థులు, మేధావులు, వివిధ రంగాల ఉద్యోగులను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. నిరంతరం ప్రజల కోసం ఉద్యమం చేసే పాలమూరు ముద్దుబిడ్డ పోరాట యోధుడు ముకురాల శ్రీహరిని శాసనమండలికి పంపించేందుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని పలువురు ప్రకటించారు. […]

Read More