Breaking News

కరోనా బాధితులపై ఎన్నారైల ఉదారత

కరోనా బాధితులపై ఎన్నారైల ఉదారత

సారథి, బిజినేపల్లి: కరోనా బాధితులు, వారి కుటుంబాలపై ఎన్నారైలు తమ ఉదారత చాటుకున్నారు. పాలమూరు ఎన్నారైల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం, తిమ్మాజిపేట ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో కరోనా కిట్లు పంపిణీ చేశారు. వైద్యసిబ్బంది, ఆశావర్కర్లకు మాస్కులు, పీపీఈ కిట్స్, థర్మల్ స్కానర్స్, పల్స్ ఆక్సిమీటర్స్ తో పాటు ఇతర పరికరాలు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారైల ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజికసేవ అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేసేందుకు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఫోరంసభ్యులు ప్రకాష్, డాక్టర్లు కల్పన, నికిత, హెల్త్ ఎడ్యుకేటర్స్ విద్యాసాగర్, శ్రీనివాసులు, హెల్త్ సూపర్ వైజర్ సుజాత, ఫార్మసిస్ట్ అశోక్ పాల్గొన్నారు.