Breaking News

పాలమూరులో బీజేపీ పాగాకు యత్నం

సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకుని పాలమూరులో పట్టుసాదించాలని ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా కేంద్రంలో ఆపార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలు పాలక నేతల పై కార్యక్రమాలు చేస్తు రాష్ట్ర నేతలు ప్రెస్ మీట్ నిర్వహించడం, లోకల్, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ విధానాలకు పాల్పడి నిర్భందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పేరు తో దోపిడీ చేస్తున్నాదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చడం లేదని విమర్శలు ఎక్కుపెట్టారు. జిల్లా లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే గెలిచిన సందర్భాలు ఉన్నాయని, కార్యకర్తలు ల పార్టీ కుటుంబాల పార్టీ కాదని చెబుతున్నారు. వారసత్వరాజకీయాలు బీజేపీలోలో జిల్లాలో కానీ రాష్టంలో కానీ చెలామణి అయ్యే పరిస్థితి ఉండవని అంటున్నారు. బీజేపీని ఇంకా బలమైన శక్తి గా చేయడమే టార్గెట్ గా పాలమూరు పై ప్రత్యేక దృష్టి సారించారు. బల్దీయా సమస్య లపై కూడా మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో బీజేపీ గట్టిగానే వినిపిస్తోంది. నాలుగు నెలలు పాటు జిల్లా కేంద్రానికి రాష్ట్ర ముఖ్య నేతలు క్యూ కట్టారు. నేడు, రేపు రాష్ట్ర సమావేశాలు పాలమూరు లో నిర్వహించడం ఇంకింత ఆపార్టీ కి నూతనోత్సవం కనిపిస్తోంది. ఏదేమైనా పాలమూరులో అధికార పార్టీకి, స్టానిక నేతలకు బీజేపీ కొరకరాని కొయ్యగా మారెందుకు అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటుందనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో కేడర్ ను అలర్ట్ చేస్తున్నారు.. మున్ముందు పాలమూరులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.