ఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ (73) కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని అతని సోదరుడు పుష్పేంద్ర చౌహాన్ మీడియాకు వెల్లడించారు. జులై 12న కరోనా వైరస్ బారిన పడడంతో అతని మొదట లఖ్‌నౌవూలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం మరింత క్షీణిస్తుండడంతో గురుగ్రామ్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. అతని కిడ్నీతో సహా కొన్ని అవయవాలు పాడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతణ్ని వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ క్రమంలో చేతన్ చౌహాన్ […]
ఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో అత్యంత మెరుగైన ఫిట్నెస్ కలిగిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫిట్నెస్ను కాపాడుకోవడానికి చేసే కసరత్తులు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన విరాట్.. కసరత్తులు మాత్రం మానలేదు. అతను చేసే కొత్త రకం ఎక్సర్సైజ్లకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటాడు. తాజాగా అతను పోస్ట్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎగురుతూ పుష్ అప్స్ చేసే క్రమంలో నేలను తాకక ముందే […]
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్య శైలి చాలా భిన్నంగా ఉంటుందని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జట్టులోని ఆటగాళ్లను మునివేళ్లపై నిలబెడతాడని చెప్పాడు. ‘కోహ్లీ కెప్టెన్సీ శైలి చాలా ప్రత్యేకం. ప్రతిసారి జట్టును ముందుండి నడిపిస్తాడు. దూకుడుగా వ్యవహరించడం, అందరికి అండగా ఉండటం అతని శైలి. ధోనీ, రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌ను ప్రశాంతంగా ఉంచుతారు. ఆటగాడిలోని నైపుణ్యాన్ని వెలికితీయడంలో ధోనీ దిట్ట. ప్రతి ఒక్కరిపై పూర్తి అవగాహన ఉంటుంది. వ్యూహాలు రచించడంలో, […]
న్యూఢిల్లీ: అందరూ అనుకున్నట్లుగా క్రికెట్లో బంధుప్రీతి లేదని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. దిగ్గజ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించాడు. నైపుణ్యం లేకుండానే అర్జున్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారన్న వాదనను తోసిపుచ్చాడు. అదే జరిగితే అర్జున్, రోహన్ గవాస్కర్ టీమిండియాలో మంచి స్థితిలో ఉండేవారన్నాడు. టాలెంట్ లేకుండా క్రికెట్లో రాణించడం కష్టమన్నాడు. ‘క్రికెట్లో బంధుప్రీతి అనే ప్రస్తావనే లేదు. అలా ఉంటే […]
న్యూఢిల్లీ: లాక్ డౌన్‌తో ఇంకా ఔట్‌డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టని టీమిండియా ఫిట్నెస్ కాపాడుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తోంది. కొంత మంది ఇంట్లో ఉన్న పెరట్లో ప్రాక్టీస్ చేస్తుంటే.. పేసర్ మహ్మద్ షమీ మాత్రం కాస్త భిన్నంగా ప్రయత్నించాడు. తన వేగాన్ని పెంచుకోవడం కోసం పెంపుడు శునకంతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ పరుగులో శునకం కంటే షమీని ఎక్కువగా పరుగెత్తినట్లు కనిపించింది.
న్యూఢిల్లీ: 2008 ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తనను చెంప దెబ్బ కొట్టిన ఘటనలో హర్భజన్‌పై నిషేధం వద్దని వేడుకున్నానని మాజీ స్టార్ పేసర్ శ్రీశాంత్ అన్నాడు. ఆ వివాదానికి అంతటితో ముగింపు పలకాలని భావించినట్లు చెప్పాడు. ‘ఆ మ్యాచ్‌లో సచిన్ ఉన్న జట్టులోనే హర్భజన్ ఉన్నాడు. నా చెంపపై కొట్టిన తర్వాత మాస్టర్ సీరియస్ అవుతూ వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. అందుకు మాస్టర్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు రాత్రి మేమంతా కలిసి డిన్నర్ చేశాం. కానీ […]
న్యూఢిల్లీ: ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడడమే తన కెరీర్లో పెద్దమలుపు అని టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ అన్నాడు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని జయించడం నేర్చుకున్నానని చెప్పాడు. ‘యార్కర్లు సంధించే నైపుణ్యం నాకు ఎప్పుడూ ఉంది. మధ్యలో కాస్త తగ్గినా మళ్లీ నేర్చుకున్నా. సన్ రైజర్స్ హైదరాబాద్ కు మారిన తర్వాత ఇన్నింగ్స్ మొదట, చివర బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. 2014లో ఆ ఫ్రాంచైజీ తరఫున 14 మ్యాచ్‌లు ఆడాను. దీంతో స్లాగ్ ఓవర్లలో […]