సామాజికసారథి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ (ఎస్సీ) గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరేందుకు నిర్వహించిన ఎంట్రెన్స్(ఆర్‌జేసీ సెట్-2022) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 19,360 సీట్ల కోసం ఫిబ్రవరి 20న నిర్వహించిన ఈ ప్రవేశపరీక్షకు 60,173 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. మెరిట్ సాధించిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 21 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. […]
సామాజికసారథి, హైదరాబాద్: గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2022 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 1,34,478 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. గత విద్యాసంవత్సరంలో 74,52 మంది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 48,120 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ఒక్క సీటు కోసం సగటున ముగ్గురు విద్యార్థులు పోటీపడ్డారు. ప్రభుత్వం […]
సంతకం చేస్తుంటే చేయి పట్టుకున్నాడు వీపనగండ్ల గురుకులంలో ప్రిన్సిపల్ కీచకపర్వం మహిళా టీచర్ను వేధిస్తున్న డి.శ్రీనివాస్ నాలుగు పేజీల లేఖలో లేడీ టీచర్ ఆక్రందన సామాజిక సారథి, కొత్తకోట: వనపర్తి జిల్లా వీపనగండ్ల సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపల్ కీచరపర్వం సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మ్యాథ్స్ బోధించే ఓ మహిళా టీచర్ను ప్రిన్సిపల్ డి.శ్రీనివాసులు కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొంటున్న మానసిక క్షోభను గుండెల్లో దాచుకొని.. కనీసం భర్తతో […]
సామాజిక సారథి, తెల్కపల్లి: తెల్కపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ సీఎల్ఆర్ కాలేజీలో నిర్వహిస్తున్న ఉయ్యాలవాడ, కోడేర్, తాడూర్ బీసీ గురుకులాల్లో 600మంది విద్యార్థులకుగాను 12మంది టీచర్లు పనిచేస్తున్నారన్నారు.16సెక్షన్లు ఉంటే సెక్షన్ కి ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరన్నారు. 80మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి బోధన చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు పడుకోవడానికి కూడా వసతులు లేని స్థితిలో […]
సామాజిక సారధి తిమ్మాజిపేట: గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న గిద్ద రమ్య అగర్వాల్ విద్యార్థికి ఫైన్ ఆర్ట్స్లోసీటు దక్కించుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామానికి చెందిన విద్యార్థి, రమ్య సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గోపాల్పేట స్కూల్లో 5వ తరగతి పూర్తి చేసి ఆరో తరగతి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయగా సెలెక్ట్ అయింది. ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మేడ్చల్ మల్కాజ్గిరి లొ జాయిన్ చేసినట్లు గిద్ద విజయ్ […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పటాన్ చెరువు మండలం ముత్తంగి బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. గురుకుల పాఠశాలలో నిన్న కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. పాఠశాలలోని ఉపాధ్యాయురాలు పాటు 43 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల సిబ్బందితో మాట్లాడారు. భయం భయం వద్దని, అందరికీ అండగా జిల్లా యంత్రాంగం […]
రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టుకు ఫిర్యాదు విచారణకై పోలీసులకు ఆదేశం సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గత కొంతకాలంగా విద్యార్థినిల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, వేధిస్తున్నారని బీసీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బీసీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టు సోమవారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి వసతులు, విద్యాబోధన, […]
సామాజిక సారథి, వైరా/ఏన్కూరు: నియోజకవర్గ కేంద్రమైన వైరాలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాలతోపాటు ఏన్కూరులోని గురుకుల బాలుర పాఠశాలలను ఆ విద్యాలయాల సంస్థ రాష్ట్ర సెక్రెటరీ రమణ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి, ఖమ్మం డీఆర్వో శిరీష, డీఈఓ యాదయ్య, బుధవారం సందర్శించి పరిశీలించారు. ఇటీవల వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29మంది విద్యార్థులు కరోనా బారిన పడిన నేపథ్యంలో స్వయంగా రాష్ట్ర సెక్రెటరీ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు కొవిడ్ […]