సారథి న్యూస్, హుస్నాబాద్: రోడ్లపై గుంతలు ఎక్కువగా పడడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే గుంతలను పూడ్చాలని కాంగ్రెస్ హుస్నాబాద్ మండలాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అన్నారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. హన్మకొండ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్లే మెయిన్‌రోడ్డు దెబ్బతినడంతో నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నారు. ఆ గుంతల్లో జూలై 7న జెండాలు పాతి నిరసన తెలిపినా మంత్రి, అధికారులకు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా […]
సారథి న్యూస్, గోదావరిఖని: స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ కు వచ్చిన కేంద్ర రసాయన ఎరువులశాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవియా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. వారిలో కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ఎంఎస్ రాజ్ ఠాకూర్, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, గాదం నందు, ఫక్రుద్దిన్, నగునూరి రాజు, పెండ్యాల మహేష్, నాజిమొద్దిన్, కౌటం సతీష్ పాల్గొన్నారు.
దోపిడే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది ఉత్సవ విగ్రహంలా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజం సారథి న్యూస్, మెదక్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి దోపిడే ధ్యేయంగా పనిచేస్తోందని సీఎల్పీ లీడర్మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మెదక్ప్రభుత్వాసుపత్రిని సందర్శించి కరోనా రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విపత్తు సమయంలో సర్వ […]
ఢిల్లీ: కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగకుండానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ముగిసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఊహాగానాలు వెల్లువెత్తడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే పలు నాటకీయ పరిణామాల మధ్య సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సోనియాగాంధీ పేరును పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ […]
హైదరాబాద్ : ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కాంగ్రెస్ అధ్యక్షపదవి నుంచి రాహుల్ తప్పుకోవడంతో.. ప్రస్తుతం సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సీనియర్ల ఒత్తిడి మేరకు సోనియా పదవి బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆరోగ్యసమస్యలు వేధించడం, తదితర కారణాలతో ఆమె పార్టీకి పూర్వవైభవం తీసుకురాలేకపోయారు. ఈ […]
సారథిమీడియా, హైదరాబాద్: ఏఐసీసీ (ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ) తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీకి ఆ పార్టీలోని సీనియర్లు ఓ ఘాటు లేఖను రాశారు. సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరుగునున్న నేపథ్యంలో ఈ లేఖ వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ప్రస్తుత విపత్కకర పరిస్థితుల్లో పార్టీని బతికించాలని.. అందుకోసం పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టాలని లేఖలో కాంగ్రెస్ సీనియర్లు కోరారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నదని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ లేఖ మీద కాంగ్రెస్ […]
పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధిస్తున్నారు పవర్‌హౌస్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రేవంత్ రెడ్డి లేఖ హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కు శనివారం లేఖ రాశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలకు గవర్నర్ హోదాలో మీరు ఇటీవల స్పందించిన తీరు కొంత ఊరట కలిగించిందన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు.. ‘రాష్ట్రంలో రాజ్యాంగ, పౌర, […]
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు ఏఎన్ఐ తెలిపింది. ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్‌లో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స చేశారని వార్తాసంస్థలు వెల్లడించాయి. తనకు కరోనా సోకిందని ప్రణబ్ ముఖర్జీ సోమవారం ట్వీట్ చేశారు. వేరే చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడ కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, […]