Breaking News

కాంగ్రెస్

ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి

ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి

సారథి, సిద్దిపేట ప్రతినిధి: అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు పట్టణాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఇసుకను తీసుకెళ్తున్నామని అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. రేణుకా ఎల్లమ్మ వాగు, మోయతుమ్మెదవాగు, పిల్లివాగు పందిల్ల, పొట్లపల్లి, కప్పగుట్ట, తొటపల్లి, నార్లపూర్, బస్వాపూర్, వింజపల్లి, కూరెళ్ల, తంగళ్లపల్లి, వరుకోలు, రామంచ, కొండాపూర్ గ్రామాల […]

Read More
ముగిసిన మున్సిపల్​నామినేషన్లు

ముగిసిన మున్సిపల్​ నామినేషన్లు

361 మంది .. 576 నామినేషన్లు చివరి రోజున 407 నామినేషన్లు దాఖలు పలు వార్డుల్లో ఖరారు కానీ పార్టీ అభ్యర్థులు నేడు నామినేషన్ల పరిశీలన సారథి ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల పాటు మున్సిపల్ ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. తొలి రెండు రోజులు తక్కువగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజు పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా […]

Read More
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

మాజీమంత్రి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

సారథి ప్రతినిధి, ములుగు: అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన మాజీమంత్రి అజ్మీరా చందూలాల్ ​కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క వారి స్వగ్రామం జగ్గన్నపేట పంచాయతీ సారంగపల్లిలో పరామర్శించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. చందూలాల్ మరణం ములుగు ప్రాంత ప్రజలకు తీరని లోటన్నారు. మంత్రిగా, ఎంపీగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె వెంట కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా […]

Read More
మోసం చేయడం ఆయన నైజం: భట్టి

మోసం చేయడం ఆయన నైజం : భట్టి

సారథి న్యూస్, తుంగపాడు(మిర్యాలగూడ): నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే ఐకేపీ సెంటర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం ద్వారా ఇటు మహిళలు, అటు రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను సీఎం కేసీఆర్ ​మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పడం ఆ తర్వాత మోసం చేయడం ఆయన నైజమని ధ్వజమెత్తారు. రైతులతో ముఖముఖి కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం నల్లగొండ […]

Read More
ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ ​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియాగాంధీ 74వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత అని పార్టీ పట్టణాధ్యక్షుడు నసిరుద్దీన్ అన్నారు. ఆమెకు రాష్ట్రం రుణపడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కల్వకుంట సొసైటీ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మహేందర్ గౌడ్, హబీబ్, సాధిక్, స్వామి, శాదుల్ పాల్గొన్నారు.

Read More
బీజేపీలో చేరిన మాజీమేయర్​కార్తీకరెడ్డి

బీజేపీలో చేరిన మాజీ మేయర్ ​కార్తీకరెడ్డి

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకురాలు బండ కార్తీకరెడ్డి తన భర్త చంద్రారెడ్డితో కలిసి బుధవారం బీజేపీలో చేరారు. వారికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భూపేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టడమే తమ లక్ష్యమన్నారు. గ్రేటర్ మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కార్తీకరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సీటు ఇవ్వకుండా మోసం […]

Read More
హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేయండి

హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేయండి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ​ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్​ చేశారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి గ్రామంలో మాజీ ఎంపీపీ జయమ్మ ప్రకాష్ గౌడ్ ​నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తుంగభద్ర నదికి […]

Read More
రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

సారథి న్యూస్, తాడ్వాయి: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ ​చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడినట్లు చరిత్రలో లేదని వివరించారు. ప్రధాని మోడీ కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారని వివరించారు. రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జలపు అనంతరెడ్డి అధ్యక్షతన సంతకాల సేకరణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఇటీవల […]

Read More