Breaking News

అనంతపురం

అనంతపురంలో బర్డ్​ఫ్లూ కలకలం

అనంతపురంలో బర్డ్​ ఫ్లూ కలకలం

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: పక్షులు, కోళ్లను బర్డ్​ఫ్లూ మహమ్మారి కబళిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీ రైతులను వణికిస్తోంది. క్రమంగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా బర్డ్​ఫ్లూ మహమ్మారి పాకినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో ఉన్నట్టుండి 20 నుంచి 30 నాటుకోళ్లు ఒకేరోజు చనిపోవడం కలకలం రేపింది. ఈ కోళ్లకు బర్డ్​ఫ్లూ వచ్చిందా? మరేదైనా కారణమా? అని బాధిత పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత […]

Read More
తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు తాడిపత్రి వాసులేనని తేలింది. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారు హేమలత, సుబ్రమణ్యం, వెంకటరంగయ్యగా గుర్తించారు.

Read More
కరెంట్​ షాక్​తో 45గొర్రెలు మృతి

విద్యుత్ షాక్ తో 45 గొర్రెలు మృతి

సారథి న్యూస్​, అనంతపురం : కరెంట్​ షాక్​తో భారీ సంఖ్యలో గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలు.. అనంతపురం జిల్లా గోరంట్ల మండల పరిధిలోని మందలపల్లి పంచాయతీలోని కరావులపల్లి తండాలో శనివారం షార్ట్​ సర్క్యూట్​తో విద్యుత్​ షాక్​ తగిలి శంకర్​ నాయక్​ అనే రైతుకు చెందిన 45 గొర్రెలు చనిపోయాయి. జీవనాధారం కోల్పోవడంతో రైతు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Read More
ఎస్పీని కలిసిన ఏఎస్సైలు

ఎస్పీని కలిసిన ఏఎస్సైలు

సారథి న్యూస్, కర్నూలు: అనంతపురం జిల్లాకు చెందిన 8 మంది ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారిని విధుల కోసం కర్నూలు జిల్లాకు కేటాయించారు. గురువారం వారు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ డాక్టర్ కాగినెల్లి ఫక్కీరప్పను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. మరిన్ని పదోన్నతులు పొందాలని ఎస్పీ ఆకాంక్షించారు. కరోనా సమయంలో ప్రజలకు మంచి సేవలు అందించి పోలీసుశాఖకు పేరు తీసుకురావాలని కోరారు.

Read More
స్వీయ జాగ్రత్తలతోనే కరోనా కట్టడి

స్వీయ జాగ్రత్తలతోనే కరోనా కట్టడి

సారథి న్యూస్, అనంతపురం : స్వీయ జాగ్రత్తలతోనే కరోనా కట్టడి సాధ్యమని అనంతపురం ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి తెలిపారు. నగరంలోని రెండో రోడ్డులో ఉన్న మెప్మా కార్యాలయం వద్ద గురువారం ర్యాగ్ పిక్కర్స్ (వీధుల్లో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు), నిరాశ్రయ కుటుంబాలకు కోవిడ్-19 కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా టెస్టులు వేగవంతం చేయడానికి […]

Read More

కరోనాతో ట్రాఫిక్ సీఐ మృతి

సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐగా నిధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కరోనా బారినపడి మంగళవారం మృతిచెందారు. స్థానిక సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీఐ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని ఆయన కితాబిచ్చారు. సీఐ రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.

Read More
భవితకు విలువలు నేర్పిద్దాం

భవితకు విలువలు నేర్పిద్దాం

ఒక వ్యక్తి నిర్మాణానికి తొలి పాఠశాలగా తాను పుట్టిపెరిగిన గృహమే ఆధారంగా నిలుస్తుందని సామాజిక శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఈ స్థితిలో చిన్నారులను మనం తీర్చిదిద్ద గలిగినప్పుడు వారి వ్యక్తిత్వ నిర్మాణం, మనోవికాసం ఎదిగాక సమాజంలో సాగించే మనుగడకు ఆలంబనగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఇందుకు తొలి పాఠశాల అయిన ఇంటిని.. బిడ్డలను తీర్చిదిద్దే మహా ఆలయంగా ఎలా మలచాలన్నదే నేడు మన ముందున్న ప్రశ్న. దీన్ని చక్కదిద్దుకోకుండా మనమేమీ సాధించలేం. మనకో సామెత ఉంది ‘మొక్కై వంగనిదే […]

Read More
క్షౌరశాలలకు అనుమతి

క్షౌరశాలలకు అనుమతి

సారథి న్యూస్, అనంతపురం: లాక్‌డౌన్‌ మూడో దశలో మరిన్ని కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర హోంశాఖ అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా రెడ్‌ జోన్లు మినహాయించి గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు తెరుచుకోవచ్చని శనివారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Read More