సారథిన్యూస్, ఖమ్మం: కరోనా బాధితులకు సాయం చేస్తూ, కరోనా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న ప్రముఖ సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ మద్దులపల్లి కరోనా కేర్సెంటర్లో చికిత్సపొందుతున్నారు. అక్కడ వారిని ఎవరూ పట్టించుకోకపోవడం, వైద్యం సరిగ్గా అందకపోవడంతో తమకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి వీరిద్దరినీ ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్‌లోని మమత […]
సారథి న్యూస్ చొప్పదండి: బతుకుదెరువులేక దుబాయ్ వెళ్లిన ఓ కార్మికుడి జీవితం అత్యంత విషాదంగా ముగిసింది. కరోనా లక్షణాలతో అతడు ప్రాణాలు కోల్పోగా అయినవాళ్లేవరూ లేకుండానే అంతిమ సంస్కారాలు జరుపవలసిన పరిస్థితి నెలకొన్నది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన క్యాదాసు కొండయ్య కొన్నేండ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. కరోనాతో బాధపడుతూ 10 రోజుల క్రితం అబుదాబి క్యాంప్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం కుటుంబ సభ్యులు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ దృష్టికి […]
సారథిన్యూస్, సిరిసిల్ల: ఇటీవల మరణించిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కాస్బె కట్కూర్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కట్కూర్‌కు చెందిన లక్ష్మమ్మ అనే మహిళ దగ్గు, తుమ్ములతో సోమవారం మృతిచెందింది. అదేరోజు ఆమెకు సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు రాకముందే మహిళకు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా లక్ష్మమ్మకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. దీంతో అంత్యక్రియల్లో పాల్గన్నవారందరినీ అధికారులు గుర్తించి హోం క్వారంటైన్‌కు […]
సారథిన్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలికి అమరజవాన్ కల్నల్ సంతోష్‌బాబు పేరు పెడతామని రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట సమీపంలోని కేసారంలో నిర్వహించిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగదీశ్‌రెడ్డి ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసారం గ్రామాన్ని కల్నల్ సంతోష్‌బాబు జ్ఞాపక చిహ్నంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తరఫున అన్నివిధాలా సాయం చేస్తామని చెప్పారు. చైనా సైన్యాన్ని తరిమికొట్టడంతో కల్నల్ […]
భారత్, చైనా సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ పార్థివదేహాన్ని లేహ్ నుంచి ప్రత్యేక విమానంలో తరలించారు. ఆయన మృతదేహం హకీంపేటకు చేరుకోనున్నది. సంతోష్‌బాబు కుటుంబ సభ్యులు కూడా ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు జరపాలని ఆర్మీ అధికారులు పట్టుపడుతున్నారు. కరోనా కారణంగా సంతోష్‌బాబు మృతదేహాన్ని సూర్యాపేటకు తరలించడం సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. కుటుంబసభ్యులు ఇష్టప్రకారమే అంత్యక్రియలు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంతోష్‌బాబు కుటుంబసభ్యులు […]
సారథి న్యూస్, ఆదిలాబాద్: బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఓ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించారు. మహారాష్ట్రలోని పుసద్ కు చెందిన కళావతి శేశరావ్ ఢగే(65) ఆదిలాబాద్‌లోని ఓ జిన్నింగ్ మిల్లులో పనిచేస్తోంది. ఆమె మృతిచెందడంతో మానవతా హృదయంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తెలిపారు.