సామాజికసారథి, రాజన్నసిరిసిల్ల: నేరెళ్ల ఘటన జరిగి ఐదేళ్లు దాటినా దళితులకు న్యాయం జరగలేదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర చీఫ్కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నేరెళ్ల బాధితుడు కోల హరీశ్ నివాసంలో నేరెళ్ల గ్రామస్తులతో ఆదివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇసుక మాఫియా ద్వారా సీఎం కేసీఆర్ కుటుంబం రూ.వేలకోట్లు దోచుకుంటోందని ధ్వజమెత్తారు. నేరెళ్ల బాధితులకు థర్డ్ డిగ్రీ చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధితులపై తప్పుడు కేసులు పెట్టారని […]
సారథి, వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ సర్వేనం.41,42,43 వక్ఫ్ బోర్డు భూముల్లో నిర్మిస్తున్న అక్రమకట్టడాలను కాపాడాలని పలువురు ముస్లింలు శనివారం సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ కు కలిసి వినతిపత్రం అందజేశారు. తిప్పాపూర్ లో చాలా వరకు వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమై ఉన్నాయన్నారు. వాటికి రక్షణ కంచె వేసి కాపాడాలని కోరారు. స్పందించిన ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు వేములవాడ అర్బన్ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు.
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో పిడియాట్రిక్ వైద్యసేవలు అందించేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. మంగళవారం వేములవాడ మండలం తిప్పాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నపిల్లలకు వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 50 పడకల్లో భాగంగా 20 పడకలు ఐసీయూ, మిగతా 30 పడకలు జనరల్ కు కేటాయించాలని ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంక్పనులను […]
సారథి, వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న అరుణ్, గుండి నరసింహమూర్తి, వెళ్ది సంతోష్ పర్యవేక్షకులుగా పదోన్నతులు పొందారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులను ఆలయ ఈవో డి.కృష్ణప్రసాద్ అందజేశారు. ఉద్యోగ సంఘం వినతి మేరకు దీర్ఘకాలంగా ఉన్న ఖాళీపోస్టుల్లో అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన ఈవో అధ్యక్షుడు చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
సారథి, సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. అందులో భాగంగానే సీటీ స్కాన్ వైద్యపరీక్షలు చేయనున్నారు. జిల్లా ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఇటీవలే సందర్శించి సీటీస్కాన్ పనిచేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలోనే వైద్యసేవలు పొందనున్నారు. సుమారు రూ.2.2 కోట్ల వ్యయంతో ఈ పరికరాన్ని అందుబాటులోకి […]
సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తిరుపతి, శ్రీనివాస్ అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న పట్టణ ఇన్ స్పెక్టర్ వెంకటేష్ వారి నుంచి రూ.5,050 విలువైన గుట్కా ప్యాకెట్ లను పట్టుకున్నారు. ఎవరైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తే కఠిన చట్టలు తీసుకుంటామని హెచ్చరించారు. అమ్మే వారి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 10వ తేదీ వరకు దస్తావేజు సేవలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నామని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులరాజు తెలిపారు. భూ విక్రయ కొనుగోలుదారులు, ప్రజలు సహకరించగలరని కోరారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మాదిరిగానే వేములవాడ నియోజవర్గాన్ని అదే తరహాలో అభివృద్ధి చేస్తానని, ఈ రెండు నియోజకవర్గాలను తనకు రెండు కళ్లుగా భావిస్తానని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు యువతకు మినీ డెయిరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతనగర్ లో సకల వసతులతో ప్రారంభించిన జడ్పీ హైస్కూలు ఆయన ప్రారంభించారు. పదవులు రాజకీయాలు ఎన్నికల […]