Breaking News

సమీక్ష

ఆదివాసి పెద్దలు సహకారించాలి

ఆదివాసి పెద్దలు సహకారించాలి

 మేడారం జాతరపై కలెక్టర్ సమీక్ష సామజిక సారథి, ములుగు: మేడారం మహా జాతర విజయవంతం చేయడానికి ఆదివాసి పెద్దలు, అదివాసి సంఘాలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు.  కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి పెద్దలు, ఆదివాసి సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. మేడారం జాతరలో ఆదివాసి సంఘాలకు 22 లిక్కర్ షాపులు […]

Read More
ఒమిక్రాన్ ముప్పు ఉంది

ఒమిక్రాన్ ముప్పు ఉంది

డాక్టర్ల ఉదాసీన వైఖరి సరికాదు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, తదితర శాఖల అధికారులతో వ్యాక్సినేషన్ పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ తో ముప్పు పొంచి ఉందని, వందశాతం వ్యాక్సినేషన్ […]

Read More
మేడారం జాతరపై మంత్రి సమీక్ష

మేడారం జాతరపై మంత్రి సమీక్ష

 సామాజిక సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ స్థానిక అధికారులతో బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకూ జరగనున్న జాతర కోసం వసతుల కల్పన, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు అందించారు. ముందుగా మేడారం అమ్మవార్లు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. జంపన్న వాగు […]

Read More

ఉద్యోగులకు గుడ్​న్యూస్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనం చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్​.. ఆర్థికశాఖపై సమీక్షించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాల చెల్లింపుపై సీఎం ఓ నిర్ణయం తీసుకోనున్నారు. రైతులకు ప్రకటించబోయే కొత్త పథకం, ఆర్థిక సౌలభ్యంపై అధికారులతో చర్చించే అవకాశం ఉన్నది. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపుతో రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడంపైనా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చలు జరపనున్నారు. కరోనా లాక్ డౌన్ కార‌ణంగా రాష్ట్ర ఆర్థిక […]

Read More

5 జిల్లాలు.. 50వేల మందికి టెస్టులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సీఎం ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే వారం పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ […]

Read More

పనులు పూర్తయితేనే సంతకాలు పెట్టండి

సారథి న్యూస్​, నల్లగొండ: మిషన్ భగీరథ పనులు అసంపూర్ణంగా ఉన్నప్పుడు సర్పంచ్​లు పూర్తయినట్లు సంతకాలు పెట్టకూడదని మంత్రులు గుంటకండ్ల జగదీశ్వర్​ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మిషన్ భగీరథ పథకం పుట్టిందే మునుగోడులో పుట్టిన ఫ్లోరిన్ ను నిరోధించడం కోసమేనని అన్నారు. బుధవారం నల్లగొండలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. 843 పంచాయతీలు 1,670 ఆవాస ప్రాంతాలతో పాటు 19 మున్సిపాలిటీలను కలుపుకుని మొత్తం 1,689 ఆవాసాల్లో మిషన్​ భగీరథ పథకం ద్వారా మంచి […]

Read More
ఆగస్టు 3న స్కూల్స్​ ఓపెనింగ్​

ఆగస్టు 3న స్కూల్స్​ ఓపెనింగ్​

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ నిర్ణయం ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్​ ఆదేశాలు సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త అందించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 3న రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను పునఃప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ‘నాడు..నేడు’ కార్యక్రమంపై సమీక్షంలో భాగంగా స్కూళ్ల అభివృద్ధిపై సీఎం ఆరాతీశారు. జులై నెలారులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 […]

Read More
ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు

ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రైవేట్​ పాఠశాలలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏ రూపంలోనూ ఫీజులు పెంచొద్దు అని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 21 నుంచి ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు నిర్వహిస్తామన్నారు. టీ శాట్‌ ద్వారా రోజుకో […]

Read More