ఢిల్లీ: పోలీసుల మీదకు రివాల్వర్ గురిపెట్టిన ఓ దోపిడీ దొంగను గురువారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని అండ్రూస్ గంజ్‌కు చెందిన ఓవ్యక్తి ప్రజలను బెదిరిస్తూ డబ్బు, నగలు దోపిడీ చేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదుతో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. దీంతో ఆ క్రిమినల్ ఓ పోలీస్‌ను రివాల్వర్‌తో కాల్చబోయాడు. అప్రమత్తమైన మరో కానిస్టేబుల్ చాకచక్యంగా అతడిని వెనుకనుంచి పట్టుకొన్నాడు. అనంతరం అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. దీంతో ఇప్పడందరూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసిస్తున్నారు. అత్యధిక టెస్టులు చేయడం.. సకాలంలో వైద్యం చేయడం, ప్రజలకు కరోనాపై విస్తృత అవగాహన కల్పించడమే కేజ్రీవాల్ విజయరహస్యం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చొరవ తీసుకోవడం కూడా కారణమని మరికొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో కరోనా కంట్రోల్లోకి రావడం స్వాగతించవలిసిన అంశమే. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో […]
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. ఇకనుంచి ప్రజలు రేషన్ కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రభుత్వమే ఇంటింటికీ రేషన్ సరుకులను పంపిణీ చేస్తుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ‘ముఖ్యమంత్రి ఘర్‌ఘర్ రేషన్ యోజన’ పథకం కింద రేషన్‌ను పంపిణీ చేయనున్నారు. ఇంటింటికి ప్రభుత్వమే రేషన్ సరుకులను పంపిణీ చేయాలన్న ప్రజల చిరకాల కోరికను తాము నెరవేర్చామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
ఢిల్లీలో సెర్చింగ్ ముమ్మరం చేసిన పోలీసులు దుబే ప్రధాన అనుచరుడు ఎన్కౌంటర్ ఫరీదాబాద్, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసుల హత్యకు కారణమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను ఢిల్లీ దగర్లోని ఫరీదాబాద్‌లో ఒక హోటల్లో పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం హోటల్లో రైడ్ చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు హోటల్‌కు చేరుకునే కొద్ది నిమిషాల ముందే వికాస్ హోటల్ నుంచి వెళ్లిపోయాడని […]
న్యూఢిల్లీ: ఫుల్లుగా మద్యం తాగి కారు నడిపిన ఓ పోలీసు వేగం అదుపు తప్పి మహిళను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రమాదానికి కారణమైన పోలీస్ ఆఫీసర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని చిల్లా గ్రామం సమీపంలో ఒక పోలీస్ ఆఫీసర్ రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు. దాన్ని గమనించిన స్థానికులు ఆమెను కాపాడేందుకు దగ్గరికి వచ్చేలోపే కారును మళ్లీ ఆమెపై నుంచి పోనిచ్చాడు. దీంతో […]
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్లో ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జూన్ చివరి నాటికి 60వేల కేసులు వస్తాని అంచనా వేశామని, కానీ 26వేల కేసులే వచ్చాయని ఆయన చెప్పారు. రోజు నమోదయ్యే కేసుల సంఖ్య కూడా వారం రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. నాలుగు వేల కౌంట్ నుంచి 2500కు తగ్గిందని చెప్పారు. గత 24 గంటల్లో 2,199 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో కేసుల సంఖ్య […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన నెలకొన్నది. తాజాగా ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో 8 మంది పిల్లలతోపాటు 23 మందికి కరోనా సోకింది. ఈ ఆశ్రమంలో 960 మంది మానసిక వికలాంగులు ఉంటున్నారు. ఈ నెల 5నుంచి 20వతేదీ వరకు మానసిక వికలాంగుల ఆశ్రమంలో కరోనా పరీక్షలు చేయగా 23 కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందులో ముగ్గురు […]
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక కేసులు నమోదై.. మహారాష్ట్ర తర్వాతి ప్లేస్‌లో ఉన్న ఢిల్లీలో కరోనా అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తలు చేస్తోంది. ఈ మేరకు కరోనా వైరస్ రెస్పాన్స్ ప్లాన్‌ను అధికారులు రివైజ్ చేశారు. దాంట్లో భాగంగానే జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంట్లో కరోనా టెస్టులు నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఈనెల 30 నాటికి స్క్రీనింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్‌కు సంబంధించి ఈ […]