సామాజికసారథి, రామకృష్ణాపూర్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద డీజే, సినిమా పాటలకు తావివ్వకుండా భక్తి పాటలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని జీటీ హాస్టల్ బాలగణేష్ మండలి వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ, తెలంగాణ సంస్కృతిని తలపించేలా రామాయణం, మహాభారతం, సాంస్కృతి వేషధారణకు సంబంధించిన కార్యక్రమాలతో యువత, విద్యార్థులను చైతన్య పరిచేలా సెప్టెంబర్ 5న పట్టణంలోని జీటీ హాస్టల్ […]
సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రమణతో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఎల్.రమణ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే.
సారథి న్యూస్, నల్లగొండ: టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రి వద్ద నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపునకు చంద్రబాబు వెళ్తున్నారు. ఇంతలో వాహనం నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది మరో వాహనశ్రేణిలో ఆయనను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. టీడీపీ కొద్దిరోజులుగా ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటుందని […]
సారథి న్యూస్, హయత్‌నగర్: రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా హయత్నగర్డివిజన్ పరిధిలోని రంగనాయకులగుట్ట, బంజారాకాలనీ, అంబేద్కర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ హయత్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో తరలి వెళ్లి వరద నీళ్లలో చిక్కిన బాధితులను తాడు సాయంతో ఎత్తు ప్రదేశానికి తరలించారు. బాధితులందరికీ పునరావాసం […]
సారథి న్యూస్, ఎల్బీ నగర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలుపడి బురదమయంగా మారాయి. మరమ్మతులు చేపట్టడంలో జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా టీడీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం హయాత్‌నగర్ డివిజన్ పరిధిలోని అన్మగల్, హయత్‌నగర్ లో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు దాసరమొని శ్రీనివాస్ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ కాలనీ, వెంకటాద్రికాలనీ, సత్యనారాయణ కాలనీల్లో వరి నాట్లు వేసి నిరసన […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: టీడీపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్ వీ కృష్ణప్రసాద్ జన్మదినం సందర్భంగా బుధవారం హయత్‌నగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు దాసరమోని శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఎస్వీ కృష్ణప్రసాద్‌ను బుధవారం ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్ జనరల్ సెక్రటరీ కాటెపాక ప్రవీణ్‌కుమార్, పిడుగు రవీందర్, జెనిగె మహేందర్, భరత్ రెడ్డి, జాన్ రెడ్డి, పలువురు […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితమైన సోమిశెట్టి వెంకటేశ్వర్లును సోమవారం ఘనంగా సన్మానించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యదర్శి ధరూరు జేమ్స్, కార్యదర్శి కె.నాగేంద్ర కుమార్, పోతురాజు రవికుమార్, సత్రం రామక్రిష్ణ, టీఎన్ఎస్ఎఫ్నాయకులు రాజుయాదవ్, తిరుపాల్ బాబు, నారాయణరెడ్డి, మంచాలకట్ట భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.