రాష్ట్ర మంత్రుల ఆశ్చర్యం, అభినందనలు సామాజికసారథి, హైదరాబాద్: అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. విజయ్ కుటుంబసభ్యులతో హైదరాబాద్ వచ్చి మంత్రులకు తాను నేసిన చీరను చూపించారు. చీర నేసేందుకు పట్టిన సమయం, ఎలా నేసారనే వివరాలు మంత్రులు విజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తాను ఇంతవరకూ చూడలేదని […]
అనాథల రక్షణకు ప్రభుత్వ కార్యాచరణ కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీగా చదువులు ఉన్నతంగా ఎదిగేలా చట్టబద్ధమైన రక్షణ ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ ఐడీ కార్డులు సీఎం కేసీఆర్‌కు కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదనలు సామాజికసారథి, హైదరాబాద్: అభాగ్యులను చేరదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అద్భుత విధానం తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అనాథలను అక్కున చేర్చుకుని వారికి ఉచితంగా విద్యను అందించాలని సంకల్పించింది. వారికి కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ను ఏర్పాటుచేసి ప్రత్యేక […]
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషిచేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సహా వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల పక్రియపైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ […]
బీజేపీతో దేశానికి ఒరిగిందేమీ లేదు సీఎం కేసీఆర్‌పై నడ్డా వ్యాఖ్యలు అమానుషం ప్రధాని మోడీ రైతుల ఉసురు పోసుకుంటున్నారు అందుకే పంజాబ్‌లో రైతన్నల అవమానం మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ.. అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అని మంత్రి కె.తారక రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ రైతు విరోధిగా మారానని దుయ్యబట్టారు. దేశంలో ఏడున్నరేళ్లుగా ప్రజాకంటక పాలన అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులను దారుణంగా హింసించి, పెట్రోగ్యాస్ ధరలు […]
వాకిళ్లలో ముగ్గులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు 10న ముగింపు కార్యక్రమాలు మంత్రి కె.తారక రామారావు సామాజిక సారథి, హైదరాబాద్: జనవరి 3 నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతుబంధు సంబరాలు నిర్వహించాలని టీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు సూచించారు. రైతుబంధు కార్యక్రమం ద్వారా రూ.50వేల కోట్లు రైతన్నల ఖాతాల్లోకి చేరిన శుభసందర్భంగా సెలబ్రేట్ చేసేందుకు మనమంతా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా జడ్పీ చైర్మన్లతో […]
అందుబాటులో 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు గిరిజనులను ఉపాధి దొరుకుతుంది కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి సామాజిక సారథి, హైదరాబాద్: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమ నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు 170 ఎకరాల సీసీఐ టౌన్ షిప్ 1,500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ […]
కనీసం గుజరాత్ నేతల మాటలనైనా వినండి కేంద్రానికి మంత్రి కేటీఆర్వినతి సామాజికసారథి, హైదరాబాద్: చేనేతపై జీఎస్టీ పెంపును మంత్రి కె.తారక రామారావు మరోసారి తనదైనశైలిలో స్పందించారు. ఇది వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. చేనేతపై జీఎస్టీ విషయంలో తమ విన్నపాన్ని పట్టించుకోకపోయినా కనీసం గుజరాత్ వాణి అయినా వినాలని పీయూష్ గోయల్‌ను కోరారు. కేంద్ర టెక్స్‌టైల్ శాఖ సహాయ మంత్రి దర్శనాజర్దోష్‌తో పాటు గుజరాత్ […]
బయోలాజికల్ సంస్థకు మంత్రి కేటీఆర్ అభినందనలు సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ నుంచి మరో కోవిడ్ టీకా మార్కెట్‌లోకి రావడంపై మంత్రి కె.తారక రామారావు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను విడుదల చేయగా, తాజాగా తెంగాణకు చెందిన ‘బయలాజికల్ ఈ’ కంపెనీ’ కార్బివాక్స్’ అనే కోవిడ్ టీకాను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ‘బయలాజికల్ ఈ’ కంపెనీ సీఈవో మహిమ దాట్ల, ఆమె బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ […]