Breaking News

తెలంగాణ నుంచి మరో టీకా

తెలంగాణ నుంచి మరో టీకా
  • బయోలాజికల్‌ సంస్థకు మంత్రి కేటీఆర్ ​అభినందనలు

సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి మరో కోవిడ్‌ టీకా మార్కెట్‌లోకి రావడంపై మంత్రి కె.తారక రామారావు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ టీకాను విడుదల చేయగా, తాజాగా తెంగాణకు చెందిన ‘బయలాజికల్‌ ఈ’ కంపెనీ’ కార్బివాక్స్‌’ అనే కోవిడ్‌ టీకాను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ‘బయలాజికల్‌ ఈ’ కంపెనీ సీఈవో మహిమ దాట్ల, ఆమె బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కంపెనీ 2022 పిబ్రవరి నుంచి నెలకు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు లక్షంగా పెట్టుకున్నది. హైదరాబాద్‌కు చెందిన ‘బయలాజికల్‌ ఇ’ కంపెనీ ’కార్బివాక్స్‌’కు అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులిచ్చింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) అభివృద్ధి చేసిన ‘కోవోవాక్స్‌’ టీకా, అమెరికా ఫార్మా సంస్థ మెర్క్‌ తయారుచేసిన ’మోల్ను పిరవిర్‌’ యాంటీవైరల్‌ గోలీకి కూడా అనుమతిచ్చింది. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనేజేషన్‌ (సీడీఎస్సీవో)కు చెందిన నిపుణులు కమిటీ సిఫారసుల మేరకు అనుమతులు ఇచ్చినట్లు డీసీజీఐ తెలిపింది.