Breaking News

క్రీడలు

For more details

ఇంగ్లండ్​కు పాక్ జట్టు

కరాచీ: కరోనా పాజిటివ్ వచ్చిన పది మంది క్రికెటర్లను పక్కనబెట్టి.. మిగతా ఆటగాళ్లతో పాకిస్థాన్ జట్టు.. ఇంగ్లండ్లోని మాంచెస్టర్​కు చేరుకుంది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బంది ఈ బృందంలో ఉన్నారు.14 రోజుల క్వారంటైన్ తర్వాత వామప్ మ్యాచ్​లో బరిలోకి దిగనుంది. ‘మరో చారిత్రాత్మక పర్యటనకు వెళ్తున్నాం. ఇంగ్లండ్​లో ఆడటం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది’ అని బాబర్ ఆజమ్ ట్వీట్ చేశాడు. సహచరులతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోను ఉంచాడు. మూడు టెస్టులు, […]

Read More

కోహ్లీలో నిజాయితీ ఎక్కువ

న్యూఢిల్లీ: అవసరమైనప్పుడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా, సామర్థ్యం భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్నాయని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. దానికి తగినట్లుగానే విరాట్​ ఆటతీరును పూర్తిగా మార్చేసుకుంటాడన్నాడు. ఏ మ్యాచ్ అయినా నిజాయితీగా ఆడటమే కోహ్లీ అతిపెద్ద బలమని చెప్పాడు. ‘కోహ్లీలో నాకు నచ్చిన అంశం ఆటపై అతనికి ఉన్న పట్టుదల, ఆసక్తి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఉండాలనుకుంటాడు. దానికోసం ఎంతకైనా శ్రమిస్తాడు. ఇంతలా కష్టపడే క్రికెటర్​ను నేను ఎప్పుడూ చూడలేదు. […]

Read More

జాతి వివక్షకూ అదే శిక్ష

మాంచెస్టర్: డోపింగ్ కు పాల్పడిన వారిని, మ్యాచ్ ఫిక్సర్లను ఎలాగైతే శిక్షిస్తున్నారో.. జాతి వివక్షకు పాల్పడిన వారిని కూడా అదే తరహాలో దండించాలని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు. అప్పుడైతేనే ఈ వివక్షల నుంచి క్రికెట్​ను కాపాడిన వారవుతామన్నారు. ‘డోపర్లు, మ్యాచ్ ఫిక్సర్లు, రేసిస్ట్లు ఒకే కోవకు చెందుతారని నేను భావిస్తున్నా. వీళ్లకు శిక్షలు కూడా ఒకే రకంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా.. కఠినంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ల వల్ల క్రికెట్​లో ఎలాంటి సమస్యలు […]

Read More

ప్రేక్షకులు లేకపోతే ఎలా

మెల్​బోర్న్​: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉంటే బాగుంటుందని మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. లేకపోతే మ్యాచ్​లో ఉండే మజా పోతుందన్నాడు. ‘ఓ పెద్ద మ్యాచ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తారు. వాళ్ల అభిమానాన్ని నిలబెట్టే స్థాయిలో మ్యాచ్ ఉండాలి. కానీ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తే ఏం బాగుంటుంది. భారత్, ఆసీస్ అంటే పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు బాక్సింగ్ డే […]

Read More

బౌలర్లను ధోనీ అదుపులో పెట్టాడు

న్యూఢిల్లీ: భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన మొదట్లో ధోనీ.. బౌలర్లను చాలా అదుపులో పెట్టుకున్నాడని మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఆ తర్వాత క్రమంగా బౌలర్లపై నమ్మకం పెంచుకున్నాడన్నాడు. అదే ఇప్పుడు అద్భుత ఫలితాలను ఇస్తోందన్నాడు. ‘2007లో ధోనీ అతిపెద్ద బాధ్యతను తీసుకున్నాడు. అప్పుడు చాలా ఉత్సాహంగా కనిపించాడు. అది పెద్ద బాధ్యత అని తెలిసినా ఏనాడూ వెనుకడగు వేయలేదు. చాలా అంశాల్లో మార్పులు తీసుకొచ్చాడు. జట్టు సమావేశాలను ఐదు నిమిషాల్లోనే ముగించేవాడు. 2007 […]

Read More

కోహ్లీ సారథ్యం చాలా భిన్నం

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్య శైలి చాలా భిన్నంగా ఉంటుందని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జట్టులోని ఆటగాళ్లను మునివేళ్లపై నిలబెడతాడని చెప్పాడు. ‘కోహ్లీ కెప్టెన్సీ శైలి చాలా ప్రత్యేకం. ప్రతిసారి జట్టును ముందుండి నడిపిస్తాడు. దూకుడుగా వ్యవహరించడం, అందరికి అండగా ఉండటం అతని శైలి. ధోనీ, రోహిత్ డ్రెస్సింగ్ రూమ్​ను ప్రశాంతంగా ఉంచుతారు. ఆటగాడిలోని నైపుణ్యాన్ని వెలికితీయడంలో ధోనీ దిట్ట. ప్రతి ఒక్కరిపై పూర్తి అవగాహన ఉంటుంది. వ్యూహాలు రచించడంలో, […]

Read More

క్రికెట్​లో బంధుప్రీతి లేదు

న్యూఢిల్లీ: అందరూ అనుకున్నట్లుగా క్రికెట్​లో బంధుప్రీతి లేదని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. దిగ్గజ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్​ను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించాడు. నైపుణ్యం లేకుండానే అర్జున్​కు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారన్న వాదనను తోసిపుచ్చాడు. అదే జరిగితే అర్జున్, రోహన్ గవాస్కర్​ టీమిండియాలో మంచి స్థితిలో ఉండేవారన్నాడు. టాలెంట్ లేకుండా క్రికెట్​లో రాణించడం కష్టమన్నాడు. ‘క్రికెట్లో బంధుప్రీతి అనే ప్రస్తావనే లేదు. అలా ఉంటే […]

Read More

ఆలోచనా పరులు ఎక్కువ

జోహెన్స్​బర్గ్​: చెన్నై సూపర్​కింగ్స్​​ డ్రెస్సింగ్ రూమ్​లో ఆలోచనాపరులు ఎక్కువ మంది ఉన్నారని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాఫ్ డు ఫ్లెసిస్ అన్నాడు. దీనివల్లే సూపర్​కింగ్స్​ ఐపీఎల్లో బాగా విజయవంతం అవుతుందన్నాడు. ‘చెన్నైతో నా అనుబంధం విడదీయలేనిది. మాది కామ్ డ్రెస్సింగ్ రూమ్. దిగ్గజ కెప్టెన్ ధోనీతో పాటు చాలా మంది ఆలోచనాపరులు ఉన్నారు. వీళ్ల అనుభవం టీమ్​కు అదనపు బలం. ప్రతి ఒక్కరిలో ఓ నమ్మకం ఉంటుంది. అవే మాకు విజయాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రతి ప్లేయర్ చాలా […]

Read More