సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో నిర్మించిన మానవ మలవ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ సమీపంలో రూ.8.7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఐబీ కార్యాలయం […]
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో గత రెండ్రోజులగా కురుస్తున్న వర్షాలతో రోడ్ల మీద నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మునగాల ఎస్సై సత్యనారాయణగౌడ్ సూచించారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మునగాల మండలంలోని తాడువాయి నుంచి తాడువాయి తండా మధ్యలో ఉన్న అలుగు ఉధృతంగా ప్రవహిస్తున్నదన్నారు. ఈ మార్గాల గుండా వెళ్లే ప్రజలు ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలని ఆయన కోరారు. అదే విధంగా మునగాల నుంచి గణపవరం, తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి, వెల్దండ, చీదేళ్ల, తంగెళ్ల గూడెం, […]
సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేటీఅన్నారం వద్ద మూసీ నదిలో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులను పోలీసులు.. స్థానికుల సహకారంతో కాపాడారు. కొన్ని రోజులుగా భారీవర్షాలు కురుస్తుండడంతో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఖాసీంపేటకు చెందిన షబ్బీర్, సోహాల్, కైఫ్ అక్కడికి.. మూసీనదిని చూసేందుకు అక్కడికి వచ్చారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కాలుజారి పడిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు, ఫైర్‌సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో నదిలో చిక్కుకున్న యువకులను కాపాడారు.
సారథి న్యూస్, నల్లగొండ: ప్రస్తుత పరిస్థితుల్లో గణేశ్ మండపాలు, నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేమని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. కరోనా విపత్తువేళ హిందూ సోదరులంతా పోలీస్‌శాఖకు సహకరించాలని ఆయన కోరారు. గణేశ్ మండపాల నిర్వాహకులకు త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా ఇండ్లల్లోనే పూజలు చేసుకోవాలని కోరారు. తయారీదారులు విగ్రహాలను తయారు చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని.. కరోనా పోయేంత వరకు ఇతర ఉపాధి మార్గాలను వెతుక్కోవాలని సూచించారు.
సారథిన్యూస్, నల్లగొండ : నకిలీ విత్తనాల కేసులో కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం భారీగా నకిలీ పట్టివిత్తనాలు పట్టుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు కేసులో విచారణ పూర్తి చేసి ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు.. సీఐ సురేష్ కుమార్ శనివారం మధుసూదన్‌రెడ్డిని వరంగల్ కు తరలించారు. నల్లగొండ కలెక్టర్ ఆదేశాల మేరకు […]
4 నెలల క్రితం తండ్రిని…ఇప్పుడు భార్యని.. అక్రమ సంబంధం అనుమానంతో ఇద్దరినీ హతమార్చిన వ్యక్తి పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాలో దారుణం.. తండ్రి కేసులో జైలు నుంచి వచ్చిన పది రోజులకే భార్యను చంపిన నిందితుడు సారథిన్యూస్, పెన్ పహాడ్ : సొంత తండ్రే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం సజావుగా సాగుతున్న సంసారంలో చిచ్చుపెట్టింది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాకు చెందిన లునవత్ స్వామి, […]
కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అశోక్ నగర్ వద్ద ఉన్న ఆసియాలో అరుదైన ఆఫ్రికన్ జాతికి చెందిన వృక్షం అదన్ సోనియా డిజిటేటన్ లీన్(బూరుగ వృక్షం) నేలకొరిగింది. రోడ్డు విస్తరణకు అడ్డం రాకపోయినా కావాలని కూల్చేశారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి వృక్ష జాతిని సందర్శనా ప్రదేశాలుగా మార్చి పర్యాటకులకు, విద్యార్థులకు వాటి ప్రాముఖ్యం తెలుపుతూ అందుబాటులో ఉంచేలా చూడాల్సిన ప్రభుత్వ అటవీ శాఖ యంత్రాంగం పట్టించుకోకపోతే భావితరాలు ఎలా విజ్ఞానం పొందుతారని ప్రజలు […]
సారథి న్యూస్, నాగార్జునసాగర్ : నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రం క్రస్ట్‌గేట్లను తాకింది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు వద్ద విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 40,259 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గురువారానికి క్రస్ట్‌గేట్ల లెవల్ (546 అడుగుల)కు నీటిమట్టం చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 13 రోజులుగా వరద వస్తుండగా, సాగర్ నీటిమట్టం రోజుకు ఒక అడుగు చొప్పున […]