న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 69,652 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 28,36,925కు చేరుకున్నది. కాగా ఇప్పటివరకు 20,96,664 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 58,794 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కాగా ఇప్పటివరకు 53,866 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 6,86,395 మంది చికిత్స పొందుతున్నారు.
సారథి న్యూస్, కర్నూలు: ఎగువ నుంచి భారీవరద రావడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. బుధవారం సాయంత్రం 195.7599 టీఎంసీల నీటి సామర్థ్యం చేరుకోవడంతో దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం 215. 807 టీఎంసీలు. 885 అడుగులకు గాను 881 అడుగుల మేర నీటినిల్వ ఉంది. జూరాల రిజర్వాయర్, సుంకేసుల బ్యారేజీ నుంచి మొత్తం శ్రీశైలానికి 3.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. సాయంత్రం ఆరు గంటలకు శిల్పాచక్రపాణి రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు మూడుగేట్లను ఎత్తి […]
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారిని తగ్గించేందుకు రెమిడిసివిర్, ఫావిపిరవర్ మందులు కొంతమేర ప్రభావవంతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఔషధకంపెనీలు ఈ మందులను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఔషధకంపెనీ రెడ్డీ ల్యాబ్స్కరోనా టాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అవిగాన్ బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ తెలిపారు. వ్యాధి తీవ్రంగా లేనివారికి ఈ మందు మెరుగ్గా […]
ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత విషమించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రణబ్ ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని.. ఆయన ప్రస్తుతం ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగిస్తున్నట్టు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ఈ నెల 10న ప్రణబ్‌ముఖర్జీ అత్యవసర చికిత్స కోసం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో […]
ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరినట్టు కుటుంబసభ్యలు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్‌దీప్ గులేరియా పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి బయట పడిన విషయం తెలిసిందే. ఈ నెల 14న అమిత్‌షాకు కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో యధాప్రకారం తన కార్యకలాపాలను కొనసాగించారు. అయితే ఆయనకు మరోసారి స్వల్ప జ్వరం, […]
ఢిల్లీ: మనదేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 55,079 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 27,02,742లకు చేరుకున్నది. ఇప్పటికీ 19,77,779 మంది కరోనానుంచి కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారిసంఖ్యకూడా గణనీయంగానే ఉన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 51,797 మంది కరోనాతో మృతిచెందారు. 6,73,166 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రవైద్యశాఖ అధికారులు కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా సోకినా భయాందోళనకు […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలను సైతం వెంటాడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్(67) షాకు కరోనా ప్రబలింది. తనకు కరోనా సోకిందని ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు కిరణ్ మజుందార్ షా స్వయంగా ఓ ట్వీట్ చేశారు. తాను త్వరలోనే కోలుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కేసుల లెక్కల్లోకి తాను కూడా చేరానని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రముఖ మహిళల్లో […]
కోల్‌కతా: కరోనా బారిన పడి మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సమరేష్ దాస్ కొంతకాంగా కరోనాతో బాధపడుతున్నారు. కరోనా విపత్తువేళ ఆయన నియోజకవర్గంలో పర్యటించి పేదప్రజలకు సేవచేశారు. కూరగాయలు, నిత్యావసరసరుకులు పంపిణీ చేసేవారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకింది.దీంతో కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సమరేస్ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అంతకుముందు జూన్‌లో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్(60)కరోనాతో మృతి […]