జడ్పీ చైర్ పర్సన్‌పై అనర్హత వేటు నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు తీర్పు సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్యపై నాగర్‌కర్నూల్ కోర్టు అనర్హత వేటువేసింది. ఎన్నికల అఫిడవిట్ లో తన సంతానం వివరాలను తప్పుగా నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. పద్మావతి తప్పుడు వివరాలు సమర్పించారని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెపై పోటీచేసిన అభ్యర్థి సుమిత్ర కోర్టుకు ఆశ్రయించంతో నాగర్‌కర్నూల్ ఎలక్షన్ ట్రిబ్యునల్ కోర్టు గురువారం ఈ మేరకు తీర్పును […]
వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు రెస్క్యూ టీమ్ మెంబర్లు మృతులు రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ వాసులు సామాజిక సారథి, రామకృష్ణాపూర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న సరస్వతి అనే గర్భిణిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇద్దరు రెస్క్యూ టీమ్ మెంబర్లు వరద నీటిలో గల్లంతయ్యారు. కొమరం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ దహేగాం మండలంలోని భీబ్రా గ్రామానికి చెందిన నేర్పల్లి సరస్వతిని ఆస్పత్రికి తరలిస్తుండగా దహేగాం పక్క నుంచి వెళ్తున్న పెద్దవాగు ఉప్పొంగడంతో దహేగాంతో పాటు పెసరికుంట, ఐనం, ఇట్యల, […]
రైతు ఉయ్యాలవాడ కాశన్న ఆత్మహత్యకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి బాధ్యత వహించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫైర్ సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: టూరిజం పేరుతో కోట్ల రూపాయలను ఖర్చుచేసి ట్యాంక్‌బండ్ అభివృద్ధి పేరుతో వంద ఎకరాలను ముంపునకు గురిచేసి ఉయ్యాలవాడ దళితరైతు కాశన్న ఆత్మహత్యకు కారకుడైన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో రాష్ట్ర […]
సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. రాష్ట్రంలో భారీవర్షాల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు (సోమవారం నుంచి బుధవారం వరకు) సెలవులు ప్రకటించిన విషయం విధితమే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో మరో మూడు రోజుల పాటు సెలవులను మరోసారి పొడిగించారు. తిరిగి సోమవారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం […]
హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలి బాధిత మహిళలను పరామర్శించిన ఆర్ఎస్పీ పులుల పేరుతో మనుషులను హింసిస్తారా? మేం అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని కోయపోచగూడెం ఆదివాసీలపై ఇటీవల పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా తమ భూములకు పట్టాలు కావాలని […]
ప్రభావం చూపలేకపోతున్న ప్రతిపక్ష పార్టీలు అంతా అధికారపార్టీదే హవా సొంత ఎజెండాలతో ముందుకు వెళ్లలేని నాయకులు సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ పొలిటికల్హీట్రాజుకుంటోంది. ఏ జిల్లాలో చూసినా రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. ఫలానా పార్టీ నుంచి ఫలానా నాయకుడు పోటీచేస్తున్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. చిన్నాచితక లీడర్లు సైతం అధికారంలోకి వచ్చే పార్టీ వైపు వెళ్లాలని తమ అంచనాల్లో ఉన్నారు. కానీ నాగర్ కర్నూల్ జిల్లా రాజకీయాలు మాత్రం కాస్తా స్తబ్దంగానే ఉన్నాయని […]
సామాజికసారథి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ (ఎస్సీ) గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరేందుకు నిర్వహించిన ఎంట్రెన్స్(ఆర్‌జేసీ సెట్-2022) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 19,360 సీట్ల కోసం ఫిబ్రవరి 20న నిర్వహించిన ఈ ప్రవేశపరీక్షకు 60,173 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. మెరిట్ సాధించిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 21 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. […]
సామాజికసారథి, హైదరాబాద్: గత మే నెలలో నిర్వహించిన TSWRJC & COE CET-2022 ప్రవేశపరీక్ష Phase-2 ఫలితాలు వెలువడ్డాయి. మొదటి దశలో సీటు రాని వారు 2వ దశలో మీ ఫలితం చూసుకోవచ్చు. అలాగే ఈనెల 10న సాధారణ గురుకులాల కాలేజీలకు రాసిన ప్రవేశపరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. https://tsswreisjc.cgg.gov.in