కొత్త వేరియంట్‌పై ఆరోగ్యశాఖ నివేదిక వ్యాక్సినేషన్ పక్రియను వేగవంతం చేయాలి దవాఖానాల్లో మౌలిక వసతులు కల్పించాలి మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ సామాజిక సారథి, హైదరాబాద్: కొత్తవ వేరియంట్‌పై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒమిక్రాన్వేరియంట్పై చర్యలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతిభవన్‌లో సోమవారం భేటీ అయింది. రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించిన హెల్త్ డిపార్ట్‌మెంట్ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతి, మందుల […]
సామాజిక సారథి, తిమ్మాజీపేట: మండల కేంద్రంలో ఉన్న మద్యం గోదాంలో ఉన్న కాలం చెల్లిన మద్యాన్ని సోమవారం అధికారులు పార బోయించారు. దాదాపుగా 243లిక్కర్ కేసులు కాలం చెల్లింది. వీటిని మద్యం ప్రియులు సేవించకుండా పోయింది. దీనితో మద్యం డిపో మేనేజర్ లచ్చయ్య నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు ఎస్ఐ అనుదీప్ సమక్షంలో కాలం చెల్లిన మధ్యాన్ని హమాలీలతో పరబోయించారు. వీటి విలువ దాదాపుగా రూ.12లక్షల దాకా ఉంటుందని డిపో అధికారులు తెలిపారు.
లక్ష రూపాయల నగదు, బంగారం చోరీ సామాజిక సారథి, సంగారెడ్డి: సదాశివపేటలో బస్సు ఎక్కిన మహిళ వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, మూడు మాసాల బంగారం చోరి జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన విజయలక్ష్మీ తన భర్త ,కూతురుతో హైదరాబాద్ వెళ్లేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డి బస్సు ఎక్కారు. బస్సు నందికంది వద్దకు చేరుకోగానే విజయలక్ష్మి టిక్కెట్ తీసుకునేందుకు చిల్లర కోసం […]
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తి కావాలి కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. డిసెంబర్ పదవ తేదీలోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి సిద్ధం చేయాలన్నారు. అన్ని మౌలిక వసతులతో పాటు అందించాలన్నారు. నిర్మాణంలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలన్నారు. ఆయా పనులన్నింటినీ పూర్తిచేసి ప్రారంభించడానికి సిద్ధం చేసేలా దృష్టి […]
రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టుకు ఫిర్యాదు విచారణకై పోలీసులకు ఆదేశం సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గత కొంతకాలంగా విద్యార్థినిల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, వేధిస్తున్నారని బీసీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బీసీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టు సోమవారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి వసతులు, విద్యాబోధన, […]
లేదంటే పార్టీ పదవీ నుంచి తప్పుకుంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సామాజికసారథి, సంగారెడ్డి: పూర్వ మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల కాంగ్రెస్ అభ్యర్థికి 230 ఓట్లు వస్తాయని, రాకపోయినా, ఎన్నికల్లో గెలవకపోయినా పార్టీ పదవీ నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టడం వల్లే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విలువ పెరిగిందన్నారు. వరి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రగడ చేస్తున్నాయన్నారు. కొనుగోలు ఆలస్యంతో ధాన్యం మొలకెత్తి రైతులు […]
సామాజిక సారథి, తిమ్మాజీపేట: నూతన ఎక్సైజ్ సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం కావడంతో ఇటీవల లక్కీ డిప్ ద్వారా ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకున్న యజమానులు మద్యం కోసం మండల కేంద్రంలోనీ టీఎస్పీసీఎల్ స్టాక్ పాయింట్ కు తరలి వచ్చారు. మొదటి రోజు 30 దుకాణాల యజమానులు లిక్కర్ బీరు తీసుకువెళ్లడానికి ఉమ్మడి జిల్లాల నుంచి దుకాణాల యజమానులు తరలివచ్చారు. తొలిరోజు రేషన్ పద్ధతిలో మద్యం అందించారు. అన్ని దుకాణాలకు మద్యం అందించాలన్న అధికారుల ఆదేశాల […]
సామాజిక సారథి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీని గట్టెక్కించేందుకు కంకణం కట్టుకున్నారు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్. ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువచేసేందుకు అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలు సందర్భాల్లో ఓ సాధారణ ప్రయాణికుడిలా స్వయంగా ప్రయాణించారు. తాజాగా ఆయన తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సపరివార కుటుంబ సమేతంగా బస్సులో సందడి చేశారు. టీఎస్ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని ప్రయాణికులకు వరించేలా […]